కరోనా విలయంలోనూ మన సత్తా చాటాం.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

| Edited By: Pardhasaradhi Peri

Jul 07, 2020 | 12:15 PM

కరోనా వైరస్ సంక్షోభంలోనూ మన దేశ సత్తాను ప్రపంచానికి చాటామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఈ క్లిష్ట సమయం రాకముందు దేశ పరిస్థితి ఎలా ఉందొ ఇప్పుడు కూడా ఈ 'షో' ఇలాగే సజావుగా సాగుతోందన్నారు. ఢిల్లీ లో..

కరోనా విలయంలోనూ మన సత్తా చాటాం.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
Follow us on

కరోనా వైరస్ సంక్షోభంలోనూ మన దేశ సత్తాను ప్రపంచానికి చాటామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఈ క్లిష్ట సమయం రాకముందు దేశ పరిస్థితి ఎలా ఉందొ ఇప్పుడు కూడా ఈ ‘షో’ ఇలాగే సజావుగా సాగుతోందన్నారు. ఢిల్లీ లోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్స్ రెండో దశను ఆయన ప్రారంభించారు. ఈ సంవత్సరంలో సివిల్ సర్వీసులు పాన్-ఇండియన్ ‘క్యారక్టర్’  ని సంతరించుకున్నాయని, గత రెండేళ్లలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ విషయంలో ఎంతో పురోగతి సాధించాయని ఆయన చెప్పారు. ఐఏఎస్ అధికారులు ఓ  నూతన భారతావని ఆర్టిటెక్టులుగా కావడానికి మంచి అవకాశం లభించిందని, ఇందుకు ప్రధాని మోదీ గట్టి పునాది వేశారని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. మనకు స్వాతంత్య్రం వఛ్చి 73 వ ఏట కూడా ఈ దేశం పటిష్టమైనదిగా, శక్తిమంతమైనదిగా రూపు దిద్దుకుందని ఆయన పేర్కొన్నారు.