India Coronavirus updates: భారత్‌లో కరోనావైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా గత 24గంటల్లో శుక్రవారం 11,713 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ వైరస్ కారణంగా 95 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,14,304 కి చేరగా.. మరణాల సంఖ్య 1,54,918 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
నిన్న కరోనా నుంచి 14,488 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 1,05,10,796 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 1,48,590 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో దేశంలో కరోనా రికవరీ రేటు 97.19 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.43 శాతంగా ఉంది.
వేగవంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ..
ఇదిలాఉంటే.. భారత్‌లో కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా సాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 54,16,849 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.
Also Read: