AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సచిన్‌ పోస్టుపై కొనసాగుతున్న దుమారం, రైతు సమస్యలపై 10 రాష్ట్రాల ప్రతినిధులతో సుప్రీం కమిటీ సంప్రదింపులు

కేంద్రానికి మద్దతుగా, రైతులకు వ్యతిరేకంగా క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్‌ పోస్టు పెట్టడంపై ఇంకా దుమారం కొనసాగుతూనే ఉంది. ఆయన ట్వీట్‌పై యూత్ కాంగ్రెస్‌ సభ్యులు...

సచిన్‌ పోస్టుపై కొనసాగుతున్న దుమారం, రైతు సమస్యలపై 10 రాష్ట్రాల ప్రతినిధులతో సుప్రీం కమిటీ సంప్రదింపులు
Venkata Narayana
|

Updated on: Feb 06, 2021 | 5:30 AM

Share

కేంద్రానికి మద్దతుగా, రైతులకు వ్యతిరేకంగా క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్‌ పోస్టు పెట్టడంపై ఇంకా దుమారం కొనసాగుతూనే ఉంది. ఆయన ట్వీట్‌పై యూత్ కాంగ్రెస్‌ సభ్యులు వినూత్న రీతిలోనిరసన వ్యక్తం చేశారు. సచిన్‌ ఫ్లెక్సీపై నల్లనూనెను పోసి.. నిరసన చేపట్టారు. రైతుల పక్షాన నిలబడకపోవడాన్ని తప్పుపట్టారు. ఇలాఉంటే, సచిన్‌ ఫ్యాన్స్‌ షరపోవాకు సారీ చెబుతున్నారు. గతంలో సచిన్‌ ఎవరో తెలియదన్నందుకు షరపోవాపై నోరుపారేసుకున్న అభిమానులు ఇప్పుడు ఆమెకు క్షమాపణలు చెబుతున్నారు. రైతుల ఆందోళన పట్టించుకోకుండా సచిన్‌ ప్రభుత్వానికి మద్దతు పలుకడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

సాగుచట్టాల రద్దు కోసం సమరం చేస్తున్న రైతు సంఘాలు.. నేడు చక్కాజామ్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో భారీ బలగాలను మొహరించిన కేంద్రం.. ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టింది. అనుమతి లేనికారణంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు దేశవ్యాప్తంగా రహదారుల ముట్టడి చేపట్టనున్నారు రైతులు.

రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ.. 10 రాష్ట్రాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపింది. ఈ నేపథ్యంలో రైతు సంఘాల నేతలు కూడా తమ అభిప్రాయాలను తెలిపారు. రాష్ట్రాల మార్కెటింగ్‌ బోర్డులతో పాటు ఫుడ్‌పార్క్‌ల ప్రతినిధులతో కమిటీ చర్చలు నిర్వహించింది.

అయితే – వ్యవసాయ చట్టాలపై సవరణలకు సిద్ధమని ప్రకటించింది కేంద్రం. విపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని రాజ్యసభలో విమర్శించారు మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌. దీంతో తోమర్‌ ప్రసంగానికి విపక్ష సభ్యులు అడ్డు తగలగంతో సభలో కొద్దిసేపు గందరగోల పరిస్థితి ఏర్పడింది.

రైతుల ఆందోళనకు మద్దతిచ్చేందుకు ఢిల్లీకి వచ్చారు అమరావతి జేఏసీ ప్రతినిధులు. ఈ ఉద్యమం దేశంలోని రైతులందరిదని వారన్నారు. కేంద్రం వ్యవసాయాన్ని కార్పొరేట్ చేతుల్లో పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. అమరావతి ఉద్యమానికి ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల మద్దతుందని వారు తెలిపారు.

ఖమ్మం జిల్లా నవ్యారెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్‌, భార్యను చంపిన నాగశేషురెడ్డి మేనమామ కూతురు రైలు కింద పడి సూసైడ్