Corona: దేశవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. నిన్న వైరస్ నుంచి ఎంత మంది కోలుకున్నారంటే..?

|

Mar 04, 2021 | 10:57 AM

Coronavirus updates: దేశంలో కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన..

Corona: దేశవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. నిన్న వైరస్ నుంచి ఎంత మంది కోలుకున్నారంటే..?
Coronavirus
Follow us on

India Coronavirus updates: దేశంలో కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఆ తరువాత కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు కూడా విధించి చర్యలు తీసుకుంటున్నారు. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 17,407 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,56,923 (1.11కోట్లు) కు పెరిగింది. ఈ మహమ్మారి కారణంగా గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 89 మంది మరణించారు. వీరితో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,57,435 కు చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌‌ను విడుదల చేసింది.

ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ (vaccination) ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. సోమవారం రెండో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,66,16,048 మందికి కరోనా వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఆందోళన కలిగించే విషయమేమిటంటే.. కరోనా కేసులతో పోల్చుకుంటే.. డిశ్చార్జ్‌ల సంఖ్య తగ్గుతోంది. కరోనా నుంచి నిన్న 14,031 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 1,08,26,075 మంది బాధితులు కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,73,413 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.03 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.41 శాతంగా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 7,75,631 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి మార్చి 3వ తేదీ వరకు మొత్తం 21,91,78,908 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది. కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 1,66,16,048 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.

Also Read:

Divya Dureja: గోవాలో ఫ్రెంచ్ మహిళపై లైంగిక దాడి.. ఎల్‌జిబిటిక్యూఐ యాక్టివిస్ట్ దివ్య దురేజా అరెస్ట్..

Food Poison: శ్రీశైలంలో 25 మంది భక్తులకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు