India Corona Cases: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు మరణాల సంఖ్య ఇలా

|

Aug 25, 2021 | 10:21 AM

భారత్​లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొవిడ్​ కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితో భారీగా పెరిగింది.

India Corona Cases: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు మరణాల సంఖ్య ఇలా
India Corona Updates
Follow us on

భారత్​లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొవిడ్​ కేసుల సంఖ్య క్రితం రోజు(25,467)తో  పోల్చితో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 37,593 మంది వైరస్ సోకినట్లు తేలింది. మరో 648 మంది  మహమ్మారి కారణంగా మరణించారు. కొత్తగా ఒక్క రోజు వ్యవధిలో 34,169 మంది కరోనా​ను జయించారు. అయితే తాజా కేసుల్లో 64.6శాతం కేసులు ఒక్క కేరళలోనే వెలుగుచూశాయి. సోమవారం ఆ రాష్ట్రంలో 24,296 కొత్త కేసులు నమోదయ్యాయి. మే 26(28,798 కేసులు) తర్వాత కేరళలో 24వేల పైన కేసులు నమోదవడం మళ్లీ ఇప్పుడే.

  • మొత్తం కేసులు: 3,25,12,366
  • మొత్తం మరణాలు: 4,35,758
  • మొత్తం కోలుకున్నవారు: 3,17,54,281
  • యాక్టివ్ కేసులు: 3,22,327

వ్యాక్సినేషన్ వివరాలు ఇలా ఉన్నాయి…

మంగళవారం ఒక్కరోజే 61,90,930 కరోనా వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు 59,55,04,593 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.

మరోవైపు వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడంతో దేశంలో క్రియాశీల రేటు 1శాతం దిగువకు చేరింది. ప్రజంట్ దేశవ్యాప్తంగా 3,22,327 మంది కోవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.99శాతంగా ఉంది.

అఫ్గాన్​ నుంచి వచ్చిన 78 మందిలో 16 మందికి కరోనా

అఫ్గానిస్థాన్‌ నుంచి మంగళవారం ఇండియాకు తరలించిన 78 మందిలో 16 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అందులో సిక్కుల పవిత్ర గ్రంథం శ్రీ గురు గ్రంథ్ సాహిబ్​ మూడు ప్రతులను తెచ్చిన ముగ్గురికి కూడా వైరస్‌ సోకినట్లు అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగా వారందరినీ క్వారంటైన్‌లో ఉంచినట్లు వివరించారు. అయితే 16మందిలో ఎలాంటి వైరస్‌ సింటమ్స్ లేవని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌ నుంచి స్వదేశానికి తరలిస్తున్న వారిని.. తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

Also Read: ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హెచ్‌సీయూ.. ఐదేళ్లలో 9 మంది బలవన్మరణం

పెళ్లింట ఊహించని విషాదం.. మినీ ట్రక్ డోర్ విరిగి నలుగురు మృతి