ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా చికిత్సా కేంద్రం..రాజధానిలో సంసిద్ధం!

భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రాణాంతక మహమ్మారి ఇప్ప‌ట్లో త‌గ్గుముఖం ప‌ట్టేలా క‌నిపించ‌డం లేదు. క్ర‌మ‌క్ర‌మంగా విస్త‌రిస్తూనే ఉంది. పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ వ‌ణికిస్తున్న ఈ రాకాసి కార‌ణంగా పిట్ట‌ల్లా ప్రాణాలు పోతున్నాయి. క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు...

ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా చికిత్సా కేంద్రం..రాజధానిలో సంసిద్ధం!

Updated on: Jun 17, 2020 | 1:07 PM

భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రాణాంతక మహమ్మారి ఇప్ప‌ట్లో త‌గ్గుముఖం ప‌ట్టేలా క‌నిపించ‌డం లేదు. క్ర‌మ‌క్ర‌మంగా విస్త‌రిస్తూనే ఉంది. పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ వ‌ణికిస్తున్న ఈ రాకాసి కార‌ణంగా పిట్ట‌ల్లా ప్రాణాలు పోతున్నాయి. క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌భుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ట్రీట్​మెంట్ సెంటర్ ను రెడీ చేస్తోంది ఢిల్లీ సర్కార్. దక్షిణ ఢిల్లీలోని 10,000 బెడ్స్ కెపాసిటీ ఉన్న రాధా సోమీ స్పిరిచ్యువల్ సెంటర్ ను కరోనా పేషెంట్ల ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా మారుస్తోంది. ఛతార్ పూర్ లో12,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రాధా సోమీ స్పిరిచ్యువల్ సెంటర్ 22 ఫుట్‌బాల్ గ్రౌండ్స్ విస్తీర్ణానికి సమానంగా ఉంటుంది. ఇక్కడ జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మూడు లక్షల మందికి పైగా పాల్గొంటారు. ఈ ప్రాంతమంతా సీసీ కెమెరాలు అమర్చి ఉన్నాయి. దీంతో కరోనా ట్రీట్​మెంట్ సెంటర్​గా ఈ కేంద్రాన్ని మార్చాలని నిర్ణయించిన ఢిల్లీ సర్కారు అందుకు కావాల్సిన ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకు ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని..500 బెడ్స్ కెపాసిటీ ఉన్న 20 హాస్పటల్స్ మాదిరిగా ఈ సెంటర్ పనిచేస్తుందని..దక్షిణ ఢిల్లీ కలెక్టర్ బీఎమ్ మిశ్రా వెల్లడించారు. కలెక్టర్ స్వయంగా ఇక్కడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎమర్జెన్సీ పెషెంట్లను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు రిఫర్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ సెంటర్ లో అంబులెన్సులు, టెస్టులు నిర్వహించేందుకు సొంత ల్యాబ్ ఫెసిలిటీలున్నాయని చెప్పారు. రెండు షిఫ్టులలో 400 మంది చొప్పున డాక్టర్లు పనిచేస్తారని తెలిపారు. పర్యవేక్షించేందుకు పారామిలిటరీ ఫోర్సెస్ పనిచేస్తాయన్నారు. ఈ నెలాఖరు నాటికి ఈ సెంటర్ కరోనా ట్రీట్​మెంట్​కు పూర్తిగా అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

ఇకపోతే, ఇక్కడి రాధా సోమీ సెంటర్ లో ప్రత్యేకతలు పరిశీలించినట్లయితే…ఇక్కడి బెడ్స్ అన్నీ .. కార్డ్ బోర్డ్ బెడ్స్ తో తయారు చేయించినవి కావటం వల్ల వైరస్ వ్యాప్తిని నిరోధిస్తుంది. కార్డ్ బోర్డ్ పై 24 గంటల కన్నా ఎక్కువ సేపు వైరస్ నిలిచి ఉండదని ఆధారాలు చెబుతున్నాయి. కాబట్టి వీటిని శానిటైజ్ చేయాల్సిన అవసరం లేదు. కావాలనుకుంటే వాటిని రీసైకిల్ చేసుకోవచ్చు. బరువు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కడికైనా సులువుగా మార్చుకోవచ్చునని వాటిని తయారీదారులు స్పష్టం చేశారు.