తెలంగాణలో కొత్తగా 2వేలు దాటిన కరోనా కేసులు..

| Edited By: Pardhasaradhi Peri

Aug 01, 2020 | 12:03 PM

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కొద్ది సేపటి కిందట వెల్లడించిన వివరాల ప్రకారం....

తెలంగాణలో కొత్తగా 2వేలు దాటిన కరోనా కేసులు..
Follow us on

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కొద్ది సేపటి కిందట వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో అంటే మొన్న(గురువారం) రాత్రి 8 గంటల నుంచి నిన్న(శుక్రవారం) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,083 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 11 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 64,786కు చేరింది. కాగా, రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 530కిపెరిగింది.

శుక్రవారం 1114 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 46,502కు చేరింది. రికవరీ రేటు 71.7 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 17,754గా ఉంది. వీరిలో 11,359 మంది హోం ఐసోలేషన్ లేదా ఇన్‌స్టిట్యూషనల్ ఐసోలేషన్‌లో ఉన్నారు.

ఇక జిల్లాల వారిగా చూసుకుంటే.. శుక్రవారం కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 578 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 228 కేసులు, మేడ్చల్ జిల్లాలో 197 కేసులు, వరంగల్ అర్బన్‌లో 134 కేసులు, కరీంనగర్‌లో 108 కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 73, నల్గొండ 48, మహబూబాబాద్ 40, పెద్దపల్లి 42, రాజన్న సిరిసిల్ల 39, భద్రాద్రి కొత్తగూడెం 35, ఖమ్మం 32 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Read More:

పక్కింటి వారితో గొడవ..ఇద్దరి ప్రాణం తీసింది