కరోనా వైరస్ కాలంలో ప్రజల కష్టాలను అర్థం చేసుకున్న ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్నవారికి ఓవర్ డ్రాఫ్ట్ (OD) సౌకర్యం అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఇది అందరికీ కాదు.. కేవలం శాలరీ అకౌంట్ ఉన్నవారికి మాత్రమే. దీంతో అవసరం అనుకున్న ఉన్నవారు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని అదనపు డబ్బును పొందవచ్చు. కరోనా టైం కాబట్టి.. ఈ సమయంలో అప్పులు పుట్టే ఛాన్స్ ఉండదు. అందుకనే ఐసిఐసిఐ బ్యాంక్ ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చింది.
ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఎలా పొందాలంటే?
ఇందుకోసం ఖాతాదారులు ఇన్‌స్టా ఫ్లెక్సీ క్యాష్ అనే ఆప్షను మొబైల్ యాప్ లేదా ఆన్‌లైన్ అకౌంట్ ద్వారా ఎంపిక చేసుకోవాలని తెలిపింది. ఇలా ఎంపిక చేసుకున్నవారి అకౌంట్‌ను బ్యాంక్ ఉద్యోగులు వెంటనే పరిశీలించి ఓడీ సదుపాయం కల్పిస్తారు. దాదాపు 48 గంటల్లోనే ఆ డబ్బు అకౌంట్‌లో జమ అవుతుంది. ఇక ఎంత డబ్బు ఇస్తారనేది.. మీ శాలరీ బట్టి ఉంటుంది. అంటే మీకు వచ్చే శాలరీకి మూడు రెట్ల వరకూ ఓడీ పొందవచ్చు. అయితే దీనిపై కొంత వడ్డీని వసూలు చేయనుంది బ్యాంక్. ఇక మరో విషయం ఏంటంటే.. ఓడీ తీసుకున్నంత అమౌంట్‌పై ఉండదు. మీరు ఎంత డబ్బు వాడారో దానిపైనే వడ్డీ వేస్తారు. ఊదాహరణకు మీరు రూ.5 వేలు తీసుకున్నారు. అందులోనే రూ.3000 వాడుకున్నారు. ఈ వడ్డీ కూడా ఆ మూడు వేలపైననే పడుతుంది.
Read More: