బ్రేకింగ్‌.. కరోనా ఎఫెక్ట్‌తో మూతపడనున్న నిమ్స్‌..

కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ఏకంగా మనకు చికిత్స అందించే వైద్యులను కూడా ఇది వదలడం లేదు. తాజాగా హైదరాబాద్‌లోని వైద్యులను కరోనా వెంటాడుతోంది. ఇప్పటి పలు ఆస్పత్రుల్లోని వైద్యులకు కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా నిమ్స్ ఆస్పత్రిలో కూడా కరోనా కలకలం రేగింది. దీంతో మూడు రోజుల పాటు నిమ్స్ ఆస్పత్రి మూతపడనున్నట్లు సమాచారం. నిమ్స్ ఆస్పత్రిలోని 5 విభాగాలు ఆదివారం నుంచి మంగళవారం వరకు మూతపడనుంది. అంటే జూన్ 7వ తేదీ నుంచి […]

బ్రేకింగ్‌.. కరోనా ఎఫెక్ట్‌తో మూతపడనున్న నిమ్స్‌..

Edited By:

Updated on: Jun 06, 2020 | 8:28 PM

కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ఏకంగా మనకు చికిత్స అందించే వైద్యులను కూడా ఇది వదలడం లేదు. తాజాగా హైదరాబాద్‌లోని వైద్యులను కరోనా వెంటాడుతోంది. ఇప్పటి పలు ఆస్పత్రుల్లోని వైద్యులకు కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా నిమ్స్ ఆస్పత్రిలో కూడా కరోనా కలకలం రేగింది. దీంతో మూడు రోజుల పాటు నిమ్స్ ఆస్పత్రి మూతపడనున్నట్లు సమాచారం. నిమ్స్ ఆస్పత్రిలోని 5 విభాగాలు ఆదివారం నుంచి మంగళవారం వరకు మూతపడనుంది. అంటే జూన్ 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిమ్స్ ఆస్పత్రిలోని 5 విభాగాలు క్లోజ్ చేయనున్నారు. ఇక్కడి కొందరి వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో.. వారు పనిచేసిన విభాగాల్లో శానిటైజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెడ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, కార్డియాలజీ & సర్జికల్ ఆంకాలజీ విభాగాలు మూతపడనున్నాయి.