ఈ లక్షణాలు ఉన్నట్లయితే కరోనా వచ్చినట్టని.. దయచేసి వారు పరీక్షలు చేయించుకోవాలని.. వైద్యులు, శాస్త్రవేత్తలు, అధికారులు పదే పదే చెబుతూనే ఉన్నారు. ఈ క్రమంలో జ్వరం, దగ్గ, జలుబు, గొంతునొప్పితో పాటు జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా డాక్టర్‌ని సంప్రదించాలి. కానీ ఇలాంటి ఏ లక్షణం లేకుండానే ఓ వ్యక్తికి కరోనా సోకింది. అదేంటని షాక్ అవుతున్నారా? ఆ వ్యక్తి కూడా అదే రకంగా షాక్ అయ్యాడు. స్వయంగా ఆ బాధితుడే చెప్పిన షాకింగ్ నిజాలేంటో మీరే తెలుసుకోండి
కరోనా వైరస్ యువకులకు రాదని.. వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువని ఇప్పటివరకూ అంతా భావించారు. కానీ అది కేవలం భ్రమ మాత్రమే అనేది.. కరోనా సోకిన ఓ వ్యక్తి పేర్కొన్నాడు. తనకు కరోనా ఉందన్న విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా వెల్లడించాడు. ఈ వైరస్ తమను ఏమీ చేయదన్న ధైర్యంగా తిరిగే ప్రతీ ఒక్కరికీ.. తన అనుభవం పాఠం కావాలని.. పరిస్థితిని వివరించాడు.
‘ఇటీవల మార్చి 20న నేను లండన్ నుంచి ఇండియాకి వచ్చాను. అప్పుడు నాకు ఎయిర్ పోర్టులో టెస్టులు చేశారు. వైద్యులు నా బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. నిజానికి అప్పటి వరకూ నాకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. కానీ.. టెస్టుల తర్వాత నాకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో నేను ఒక్కసారిగా షాక్ అయ్యా. ఈ విషయం తెలిసిన వెంటనే.. నేను కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌ని కలవకుండా.. సెల్ఫ్ క్వారంటైన్ పాటిస్తూ గాంధీ ఆస్పత్రికి చేరుకున్నాడు. ప్రస్తుతం నేను ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నా’.. అని తెలిపాడు. ఈ సందర్బంగా అతను కొన్ని షాకింగ్ వివరాలు చెప్పాడు. ఎయిర్‌పోర్టులో కరోనా బాధితులు ఎలా తప్పించుకున్నారో వివరించాడు.
నాతో పాటు లండన్ నుంచి వచ్చిన వ్యక్తులకు కూడా ఎయిర్‌పోర్టు అధికారులు టెస్టులు నిర్వహించారు. సెల్ఫ్ డిక్లెరేషన్ ఫామ్‌లో కరోనా లక్షణాలు లేవని వెల్లడిస్తున్నారు. కొంతమందిని ఆస్పత్రికి తీసుకెళ్లే సయమంలో తప్పించుకున్నారు. క్వారంటైన్‌లో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుందనే భయంతోనే వీరంతా అలా చేస్తున్నారు. నిజానికి ఇది వారితో పాటు వారి కుటుంబసభ్యులను కూడా ప్రమాదంలో పడేస్తుందని వారికి అర్థం కావడం లేదు. కాబట్టి.. ఆ వైరస్ మీ పక్కనే ఉన్నా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే కరోనా వైరస్ సోకిన ప్రతీ వారిలో.. లక్షణాలు కనిపించాలనే రూల్ లేదు. దానికి నేనే ఉదాహరణ. లక్షణాలు కనిపించడం లేదు కదా.. అని లైట్ తీసుకోకండి. కొంచెం అలసటగా ఉన్నా.. మీ అంతట మీరే వెళ్లి చెకింగ్ చేసుకోండని తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
జగన్ ప్రభుత్వానికి పవన్ మరో డిమాండ్.. ఈఎమ్‌ఐ చెల్లింపులు పొడిగించాలని..
వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన
ఇది పచ్చి అబద్ధం.. ఈ సమయంలోనూ నాపై రూమర్లు ప్రచారం చేయడం దారుణం
ఏప్రిల్ 15 తరువాత కూడా లాక్‌డౌన్ కంటిన్యూ?
కరోనా వైరస్ తొందరగా వ్యాపించే ప్రదేశాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి!
కరోనా విజృంభణ: టీఆర్ఎస్ నేతల కీలక నిర్ణయం.. రూ.500 కోట్ల విరాళం