ఢిల్లీలో 107 ఏళ్ళ వయసున్న వృధ్ధుడు ముక్తార్ అహ్మద్ కరోనా వైరస్ ని జయించాడు. బహుశా దేశంలో ఈ వైరస్ మీద పోరు జరిపి విజయం సాధించిన వృధ్ధుల్లో ఈయనే పెద్దవాడు.. సెంట్రల్ ఢిల్లీ లోని నవాబ్ జంగ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. కరోనా మహమ్మారికి గురైన ఇతడిని గత నెలలో ఢిల్లీ లోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. 17 రోజుల అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. తన కొడుకు నుంచి ముక్తార్ అహ్మద్ కి కరోనా సోకిందట. ఈ పెద్దాయన తన కుటుంబ సభ్యుల నుంచి భౌతిక దూరాన్ని పాటిస్తూ.. డాక్టర్లు చెప్పిన సూచనలు తూచా తప్పకుండా ‘అమలు చేస్తున్నాడు’. ఎవరూ ఈ వ్యాధి అంటే భయపడరాదని, ధైర్యంగా, మనో నిబ్బరంతో దీన్ని ఎదుర్కోవచ్చునని ముక్తార్ అంటున్నాడు.