లాక్‌డౌన్‌పై బెంగళూరు పోలీస్ కమిషనర్ ఏమన్నారంటే..!

|

Jul 05, 2020 | 6:10 PM

కర్నాటకలో విస్తరిస్తున్న కరోనా కేసుల దృష్ట్యా ఆ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని బెంగళూరులో 33 గంటల పాటు లాక్‌డౌన్‌ విధించింది. శనివారం నుంచి సోమవారం సాయంత్ర 5గంటల వరకు లాక్‌డౌన్‌ విధించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఒకరోజు మీ పనులు వాయిదా వేస్తే స్వర్గం ఏమి పడదంటూ బెంగళూరు పోలీసు అధికారి భాస్కర్‌‌ రావు ట్వీట్‌లో కామెంట్ చేశారు.

లాక్‌డౌన్‌పై బెంగళూరు పోలీస్ కమిషనర్ ఏమన్నారంటే..!
Follow us on

కర్నాటకలో విస్తరిస్తున్న కరోనా కేసుల దృష్ట్యా ఆ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని బెంగళూరులో 33 గంటల పాటు లాక్‌డౌన్‌ విధించింది. శనివారం నుంచి సోమవారం సాయంత్ర 5గంటల వరకు లాక్‌డౌన్‌ విధించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటికే బెంగళూరులో ప్రతి ఆదివారం లాక్‌డౌన్‌ పాటించాలని అధికారులు నిర్ణయించారు, అయితే ఈ సారి శనివారం నుంచి సోమవారం వరకు లాక్‌డౌన్‌ విధించారు. ఈ నేపథ్యంలో బెంగళూరు పోలీసు కమిషనర్‌‌ ప్రజలను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. లాక్‌డౌన్‌ శనివారం 8గంటలకు స్టార్ట్‌ అవుతుంది. సోమవారం సాయంత్రం 5గంటలకు ముగుస్తుంది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాద్దన్నారు. ఒకరోజు మీ పనులు వాయిదా వేస్తే స్వర్గం ఏమి పడదంటూ బెంగళూరు పోలీసు అధికారి భాస్కర్‌‌ రావు ట్వీట్‌లో కామెంట్ చేశారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ సోమవారం సాయంత్రం ఎత్తేయనున్నట్లు స్పష్టం చేశారు. సోమవారం నుంచి నైట్‌ కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. ప్రజల ప్రాణాల కోసమే లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నామని కమిషనర్ తెలిపారు.