కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్ రావు ఫైర్

|

Jul 04, 2020 | 8:42 PM

తెలంగాణ రైతులకు మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌రావు కోరారు. సాగుబడి లేకపోతే దిగుమతి చేసుకోవాలని కాని…పుష్కలంగా రాష్ట్రంలో పప్పు ధాన్యాలు పండుతుంటే ఆఫ్రికా నుండి కొనుగోలు చేయడం ఏమిటని కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్రం ఎగుమతి, దిగుమతుల్లో పాలసీలు మార్చుకోవాలని సూచించారు. రైతులకు నష్టం కలిగే ఈ పాలసీపై కేంద్రం సమీక్ష జరపాలని సూచించారు. సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమలు చేపట్టారు మంత్రి హరీష్‌రావు. మధ్యాహ్నం ఒకటిన్నరకు సంగారెడ్డి కలెక్టరేట్‌లో […]

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్ రావు ఫైర్
Follow us on

తెలంగాణ రైతులకు మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌రావు కోరారు. సాగుబడి లేకపోతే దిగుమతి చేసుకోవాలని కాని…పుష్కలంగా రాష్ట్రంలో పప్పు ధాన్యాలు పండుతుంటే ఆఫ్రికా నుండి కొనుగోలు చేయడం ఏమిటని కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్రం ఎగుమతి, దిగుమతుల్లో పాలసీలు మార్చుకోవాలని సూచించారు.

రైతులకు నష్టం కలిగే ఈ పాలసీపై కేంద్రం సమీక్ష జరపాలని సూచించారు. సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమలు చేపట్టారు మంత్రి హరీష్‌రావు. మధ్యాహ్నం ఒకటిన్నరకు సంగారెడ్డి కలెక్టరేట్‌లో కరోనా వ్యాప్తి, రైతు వేదికలు, స్మశాన వాటికలు, డంపు యార్డుల నిర్మాణంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.