Corona Cases: హర్యానాలోని గురు గ్రామ్ లో ఓ హోసింగ్ సొసైటీలో 22 మంది కరోనా వైరస్ పాజిటివ్ కి గురయ్యారు. ఈ సొసైటీలోని ఫ్లాట్స్ లో ఒకరు ఇటీవల ఓ బర్త్ డే పార్టీకి వెళ్లి వఛ్చి ఈ ఈ పాజిటివ్ కి గురి కావడంతో ఇతరులకు కూడా ఇది సోకింది. ఈ హోసింగ్ సొసైటీలో మొతం 30 ఫ్లాట్స్ ఉన్నాయి. సుమారు 2 వేలమంది నివసిస్తున్నారు. ఇప్పటికే 500 శాంపిల్స్ ని అధికారులు సేకరించారు. మొత్తం నాలుగు ఫ్లాట్స్ ని కంటెయిన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. శాంపిల్స్ పరీక్షల నిర్ధారణ తరువాతే ఈ ఫ్లాట్స్ వారిని బయటికి అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు గురుగ్రామ్ లో పెద్దగా కోవిద్ కేసులు లేవు. కానీ తాజాగాఒకే హోసింగ్ సొసైటీలో ఇన్ని కేసులు బయటపడడం ఇదే మొదటిసారి.
ఇలా ఉండగా హర్యానా ప్రభుత్వం కోవిద్ కేసుల కట్టడికి పలు చర్యలు తీసుకుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా ఫేస్ ముసుకు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించింది. మాస్కులు ధరించనివారికి జరిమానా విధించే విషయాన్నీ కూడా యోచిస్తోంది. దేశంలో ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో కోవిద్ కేసులు పెరిగిన నేపథ్యంలో హర్యానా సర్కార్ పటిష్టమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఇప్పటికే పలు ప్రొటొకాల్స్ ను ప్రకటించింది. కేంద్ర మార్గదర్శలకు తోడు ప్రత్యేకంగా వీటిని కూడా ప్రజలు పాటించాలని సూచించింది. అటు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తున్నట్టు ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.