ఆ రాష్ట్రంలో ‘నమస్తే ట్రంప్’ వల్లే కరోనా వ్యాప్తి జరిగిందట..

|

May 07, 2020 | 4:00 PM

ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 52952 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య 1783కి చేరింది. అలాగే దేశంలో మహారాష్ట్ర తర్వాత గుజరాత్‌లోనే అత్యధిక కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇక ఈ రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అసలు కారణం ఫిబ్రవరిలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ అని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ చావ్దా ఆరోపించారు. దీనిపై త్వరలోనే గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. […]

ఆ రాష్ట్రంలో నమస్తే ట్రంప్ వల్లే కరోనా వ్యాప్తి జరిగిందట..
Follow us on

ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 52952 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య 1783కి చేరింది. అలాగే దేశంలో మహారాష్ట్ర తర్వాత గుజరాత్‌లోనే అత్యధిక కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇక ఈ రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అసలు కారణం ఫిబ్రవరిలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ అని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ చావ్దా ఆరోపించారు. దీనిపై త్వరలోనే గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఓ వీడియో మెసేజ్ ద్వారా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు జారీ చేసినా కూడా బీజేపీ వాటిని పట్టించుకోకుండా లక్షల మందితో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని నిర్వహించిందని గుజరాత్ కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది.

ఈ కార్యక్రమానికి విదేశీయులు వేలాది మంది గుజరాత్‌కు తరలి వచ్చారని.. వారి ద్వారా వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించిందని విమర్శించారు. అయితే గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిన ఆరోపణలను ఆ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ప్రశాంత్ వాలా తీవ్రంగా ఖండించారు. ట్రంప్ ఏదైనా దేశంలో పర్యటించడాని కంటే ముందు అమెరికాకు చెందిన ప్రత్యేక బృందం అక్కడ పర్యటించి సెక్యూరిటీతో పాటు ఆరోగ్య సంబంధమైన అంశాలను పరిశీలిస్తుందని వాలా తెలిపారు. వారు ఓకే చెప్తేనే గానీ ట్రంప్ ఏ దేశంలోనూ పర్యటించరని స్పష్టం చేశారు.