Groom died before marriage : రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్‌గల్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తెల్లవారితే పెళ్లనగా వరుడ్ని కరోనా మహ్మమ్మారి కాటేసింది. కుటుంబమంతా ఆనందంగా పెళ్లి ఏర్పాట్లలో మునిగి ఉంటే, ఉన్న ఫళంగా నవ వరుడు ప్రాణాలు లేకుండా విగతజీవిగా పడిపోవడం పెళ్లి ఇంటిని చావు ఇంటిగా మార్చేసింది . వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్‌గల్ గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సింగంరావు పవన్‌కుమార్(34)కు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరుకు చెందిన యువతితో శనివారం ఉదయం 11 గంటలకు వివాహం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి తంతులో భాగంగా శుక్రవారం సాయంత్రం గున్‌గల్‌లో పవన్‌కుమార్‌ను పెళ్లికొడుకును చేశారు. అయితే, ఆ కొద్దిసేపటికే వరుడు పవన్ చలితో వణికిపోసాగారు. దీంతో ఆయన సోదరుడు కిరణ్‌కుమార్ కారులో పవన్ ను రాత్రి 11 గంటలకు నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పవన్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.
కాగా, వరుడి సోదరుడైన కిరణ్‌కుమార్ ఇటీవల కరోనాతో వారం రోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది.. 5 రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. ఈ నేపథ్యంలో పవన్‌కుమార్ మృతికి కొవిడ్ కారణమై ఉంటుందని గ్రామస్థులు భావిస్తున్నారు.
Read also : Sony Wood Nuthulapaty : ‘సీఎం జగన్ నియమించిన APPSC సభ్యులు నూతులపాటి సోనీ వుడ్ ఏంమాట్లాడారో చూడండి’ : బీజేపీ