Home Quarantine Rules: కాలు బయటపెడితే రూ. 2000 ఫైన్… కొత్త రూల్ తీసుకొచ్చిన కార్పోరేషన్..

|

May 19, 2021 | 10:01 AM

కోవిడ్‌తో దేశం మొత్తం కొట్లాడుతోంది. కరోనా బాధితులు హోం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తే, అలాంటి వారికి రూ.2వేలు జరిమానా విధించాలని

Home Quarantine Rules: కాలు బయటపెడితే రూ. 2000 ఫైన్... కొత్త రూల్ తీసుకొచ్చిన కార్పోరేషన్..
Quarantine Rules
Follow us on

కోవిడ్‌తో దేశం మొత్తం కొట్లాడుతోంది. కట్టడి కోసం ఒక్కో రాష్ట్రం ఒక్కోలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కరోనా బాధితులు హోం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తే, అలాంటి వారికి రూ.2వేలు జరిమానా విధించాలని గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. హోం క్వారంటైన్ లో ఉండాల్సిన కోవిడ్ బాధితులు నిబంధనలు ఉల్లంఘించి బయట తిరిగితే వారికి రూ.2000 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఇలా తరచూ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిని కరోనా కేర్ సెంటర్‌కు  తరలిస్తామని చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం ఒక్కరోజే తమిళనాడులో 33,059 కరోనా కేసులు నమోదు కావడంతో ఆందోళన నెలకొంది. 21,262 మంది కోవిడ్ నుంచి కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

గత 24 గంటల్లో 364 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,31,596కి పెరిగింది. కరోనా కట్టడికి చర్యలు ముమ్మరం చేసిన సీఎం స్టాలిన్ కొవిడ్ కమాండ్ సెంటరును ఆకస్మిక తనిఖీ చేశారు. కోవిడ్తో మరణించిన ఫ్రంట్ లైన్ కార్మికులు, వైద్యులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని తమిళనాడు సీఎం ప్రకటించారు. ఫ్రంట్ లైన్ కార్మికులకు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ప్రత్యేక ఇన్ సెంటివ్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి : Black fungus : అనంతపురం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం.. విషయం బయటకు పొక్కకుండా యంత్రాంగం జాగ్రత్తలు.!

Another System: అప్పుడే మించిపోలేదు.. ముంచేందుకు మరో తుఫాన్ రెడీ.. IMD మరో హెచ్చరిక..