కరోనా నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రభుత్వ పాఠశాల తెరుచుకుంది. నెల్లూరు జిల్లాలోని అనపర్తి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల కరోనా టైంలో ఓపెన్ అయింది. విద్యా శాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకుండానే పాఠశాలను తెరిచారు. దీంతో టిఫిన్ బాక్సులు, బుక్స్, బ్యాగ్స్‌లతో ప్రత్యక్ష్యమయ్యారు పిల్లలు. 80 రోజుల తరువాత స్కూల్ ఓపెన్ చేయడంతో.. రెడీ అయి విద్యార్థులు పాఠశాలకు వచ్చేశారు. అయితే స్కూల్స్ ఓపెన్ చేయడానికి ఎలాంటి పర్మిషన్ లేదన్నారు ఎమ్ఈవో. కేవలం ఆన్‌లైన్ క్లాసులకు మాత్రమే అనుమతి ఉందన్నారు. ఆ పాఠశాల హెడ్‌మాస్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఆన్ లైన్ క్లాసులు చెక్ చేయడానికే పిల్లలను స్కూల్‌కి రమ్మన్నాని పొంతనలేని సమాధానం చెప్పారు.
కాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 304 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 246 మంది కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన 52 మంది, విదేశాలకు చెందినవారు 8 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. తాజాగా ఇద్దరు కరోనాతో చనిపోయారు. కర్నూలు జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాలో ఒకరు మరణించారు. 47మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5087కి చేరింది. ఇప్పటివరకు 2770 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2231. ఇప్పటివరకు రాష్ట్రంలో వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య 86కి పెరిగింది. రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
Read More: