అష్ట దిగ్బంధనంలో శ్రీకాళహస్తి..క‌రోనా క‌ట్ట‌డికి క‌ఠిన నిర్ణ‌యాలు

శ్రీకాళహస్తి పట్టణాన్ని అధికారులు అష్టదిగ్బంధనం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు బయటకు రాకూడదని అధికారులు స్పష్టం చేశారు.

అష్ట దిగ్బంధనంలో శ్రీకాళహస్తి..క‌రోనా క‌ట్ట‌డికి క‌ఠిన నిర్ణ‌యాలు

Updated on: Apr 24, 2020 | 10:31 AM

శ్రీకాళహస్తి పట్టణాన్ని అధికారులు అష్టదిగ్బంధనం చేశారు. ఈ పట్టణంలో ఏకంగా 40కిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు. పట్టణంలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు బయటకు రాకూడదని అధికారులు స్పష్టం చేశారు.  పాలు, మందులు, నిత్యావసరాలను వలంటీర్ల సాయంతో ఇళ్ల వద్దనే అందిస్తామని అధికారులు ప్రకటించారు.
చిత్తూరు జిల్లాను కరోనా వణికిస్తోంది..ఒక్క చిత్తూరు జిల్లాలోనే 73 వైర‌స్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువ శ్రీకాహస్తిలో ఉన్నాయి. గురువారం విడుదలైన బులిటెన్‌లో చిత్తూరు జిల్లాలో 14మంది కరోనా బారిన పడ్డారు. ముఖ్యంగా జిల్లాలో పెద్ద సంఖ్య‌లో పోలీసులకు కూడా కరోనా రావడం కలకలంరేపింది. వీరిలో శ్రీకాళహస్తికి చెందిన బాంబ్‌ డిస్పోజబుల్‌ స్క్వాడ్‌ ఏఎస్‌ఐతో పాటు ఓ హెడ్‌ కానిస్టేబుల్‌, నలుగురు కానిస్టేబుళ్లకు పాజిటివ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వాస్పత్రిలోని పారిశుద్ధ్య విభాగంలో పనిచేసే ఉద్యోగినికి కూడా వైరస్‌ సోకింది.
శ్రీకాళహస్తిలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం నుంచి పట్టణంలో సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు.. ఇక కఠిన ఆంక్షలు ఉంటాయి. శ్రీకాళహస్తిలో లాక్‌డౌన్‌ సడలింపులు ఉండబోవని.. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జిల్లా కలెక్టర్‌ భరత్‌గుప్తా స్పష్టం చేశారు. ఇళ్ళలో కూడా భౌతిక దూరం పాటించాలని సూచించారు. లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ మేర‌కు ప‌లు అవ‌స‌రాల‌కు సంబంధించి కాల్‌సెంట‌ర్ల నెంబ‌ర్ల‌ను అందుబాటులో ఉంచారు..
* ఇవాళ్టి నుండి శ్రీ కాళహస్తి లో పూర్తిగా లాక్ డౌన్

•  ప్రజలు ఇంటికే పరిమితం కావాలి

• పాలు, మెడిసిన్స్, నిత్యవసర వస్తువులు పూర్తిగా డోర్ డెలివరి

• శ్రీకాళహస్తి కోవిడ్ – 19 కాల్ సెంటర్లు 9849907502,  9849907505, 9100929873

– మెడికల్ ఎమర్జెన్సీ – 8008553660
 
– నిత్యావసర వస్తువుల కొరకు కిరాణా దుకాణాల వివరాలు, ఫోన్ నెంబ‌ర్ల‌ను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.