ఆ శానిటైజర్ల ఎగుమతిపై బ్యాన్..!

| Edited By:

May 06, 2020 | 8:45 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తుందన్నది తెలిసిందే. దీనికి వ్యాక్సిన్ లేకపోవడంతో.. దీనిని ఎదుర్కోవడం పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా ఇది చేతుల కలపడం ద్వారా.. ఇతర వ్యక్తులను కలవడం ద్వారా.. ఈ వైరస్ వ్యాపిస్తోంది. ముఖ్యంగా ముక్కు, కళ్లు, నోరు గుండా ఇది ప్రవేశిస్తుండటంతో.. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని.. ఎందుకంటే చేతులతోని ముక్కు,నోరు, కళ్లను నిత్యం టచ్ చేస్తుంటామని ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే చేతుల్లో ఉండే క్రిములతో పాటు.. కరోనా వైరస్‌ను […]

ఆ శానిటైజర్ల ఎగుమతిపై బ్యాన్..!
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తుందన్నది తెలిసిందే. దీనికి వ్యాక్సిన్ లేకపోవడంతో.. దీనిని ఎదుర్కోవడం పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా ఇది చేతుల కలపడం ద్వారా.. ఇతర వ్యక్తులను కలవడం ద్వారా.. ఈ వైరస్ వ్యాపిస్తోంది. ముఖ్యంగా ముక్కు, కళ్లు, నోరు గుండా ఇది ప్రవేశిస్తుండటంతో.. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా
ఉంచుకోవాలని.. ఎందుకంటే చేతులతోని ముక్కు,నోరు, కళ్లను నిత్యం టచ్ చేస్తుంటామని ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే చేతుల్లో ఉండే క్రిములతో పాటు.. కరోనా వైరస్‌ను కూడా  సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్‌లను ఉపయోగిస్తున్నాం. అయితే దీని డిమాండ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెరిగింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ  ఆల్కాహల్ ఆధారిత శానిటైజర్‌ ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ ఆల్కాహాల్‌ శానిటైజర్లను మార్కెట్‌లో అందుబాటులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) బుధవారం నాడు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆల్కాహాల్‌ ఆధారిత శానిటైజర్ల ఎగుమతిపై ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది.