గూగుల్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్

గూగుల్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా 1000 డాలర్లును అల‌వెన్స్‌‌గా ఇవ్వాలని నిర్ణయించింది. ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులకు అవసరమైన ల్యాప్‌టాప్‌, ఇతర హార్డ్‌వేర్‌ పరికరాల కొనుగోలు నిమిత్తం ఈ సహకారం అందిస్తున్నట్లు గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ఈ క్లిష్ట సమయంలో ఉద్యోగులకు మనోధైర్యాన్ని ఇవ్వడంతో పాటు, కంపెనీ తమ కోసం ఉందన్న భరోసాను కలిగిస్తుందని చెప్పారు. అయితే జులై 6 నాటికి ప్రపంచ […]

గూగుల్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్

Edited By:

Updated on: May 27, 2020 | 1:40 PM

గూగుల్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా 1000 డాలర్లును అల‌వెన్స్‌‌గా ఇవ్వాలని నిర్ణయించింది. ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులకు అవసరమైన ల్యాప్‌టాప్‌, ఇతర హార్డ్‌వేర్‌ పరికరాల కొనుగోలు నిమిత్తం ఈ సహకారం అందిస్తున్నట్లు గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ఈ క్లిష్ట సమయంలో ఉద్యోగులకు మనోధైర్యాన్ని ఇవ్వడంతో పాటు, కంపెనీ తమ కోసం ఉందన్న భరోసాను కలిగిస్తుందని చెప్పారు.

అయితే జులై 6 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ గూగుల్ కార్యాలయాలను తెరిచేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. ఆయా నగరాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తన నిర్ణయం ఉంటుందని పిచాయ్ ప్రకటించారు. అయితే భౌతిక దూరం వంటి నిబంధనలను పాటిస్తూ, పరిమిత సంఖ్యలో, రొటేషన్‌ పద్ధతిలో ఉద్యోగులు హాజరయ్యేలా చూస్తామన్నారు.