
ఇన్ని నెలలుగా ఒక్క కరోనా మృతి కూడా లేని గోవా రాష్ట్రంలో తొలి కరోనా మరణం నమోదైంది. 85 ఏళ్ల మహిళ కరోనా వైరస్‌తో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే ధృవీకరించారు. ”కరోనాతో పోరాడుతూ 85ఏళ్ల మహిళ ప్రాణాలొదిలింది” అని ఆయన తెలిపారు. కాగా దేశంలో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి గోవా ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఒకానొక సమయంలో కొద్ది రోజుల పాటు గోవాలో కొత్త కేసులు నమోదు కాలేదు. దీంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే లాక్‌డౌన్ సడలింపుల తరువాత మిగిలిన రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు గోవాకు వస్తుండటంతో అక్కడ కేసులు సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం గోవాలో నమోదైన కేసుల సంఖ్య 754 ఉండగా.. అందులో 129 మంది కోలుకున్నారు. తాజాగా ఒకరు మరణించారు.
Read This Story Also: ప్రభుత్వ పిల్లల ఆశ్రమంలో 57 మందికి కరోనా