గోవాకి టూరిస్టుల ఆహ్వానం..! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం

| Edited By:

May 12, 2020 | 1:26 PM

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోన్న తరుణంలో టూరిస్టులకు ఆహ్వానం పలకబోతుంది గోవా రాష్ట్రం. ఈ మేరకు గోవా సీఎం ప్రమోద్ సావంత్ కీలక నిర్ణయం ప్రకటించారు. సోమవారం ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో..

గోవాకి టూరిస్టుల ఆహ్వానం..! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం
Goa beach
Follow us on

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోన్న తరుణంలో టూరిస్టులకు ఆహ్వానం పలకబోతుంది గోవా రాష్ట్రం. ఈ మేరకు గోవా సీఎం ప్రమోద్ సావంత్ కీలక నిర్ణయం ప్రకటించారు. సోమవారం ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో.. ఆయనతో చర్చించిన సీఎం ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గోవా ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం టూరిజమే. ముఖ్యంగా ఇక్కడకి విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. అయితే గత రెండు నెలల నుంచి కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా.. ఆ రాష్ట్రానికి ఆదాయం లేకుండా పోయింది.

అయితే సోమవారం ప్రధాని మోదీ.. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో.. దేశంలో పర్యాటక రంగాన్ని కూడా గాడిన పెట్టాల్సిన అవసరం ఉందంటూ.. చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలను కోరారు ప్రధాని. దీంతో.. తెల్లారే గోవా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసేసుకుంది. పర్యాటకులను ఆహ్వానించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు.

కాగా ప్రస్తుతం గోవా రాష్ట్రం గ్రీన్‌ జోన్‌గా ఉంది. అక్కడ కేవలం 7 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆ ఏడు కేసుల్లోనూ బాధితులు రికవరీ అయ్యారు. అందువల్ల ఇక్కడ ఒక్క మరణం కూడా లేదు. అందుకే పర్యాటకుల్ని ఆహ్వానించబోతున్నట్లు పేర్కొన్నారు సీఎం ప్రమోద్. అలాగే గోవా రాష్ట్రం సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి మాత్రం పర్యాటకులను అస్సలు అనుమతించమన్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా ఎక్కువగా ఉన్న కారణంగా వారిని అనుమతించబోమన్నారు. మే 17వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందో దాన్ని బట్టి.. వేగంగా గైడ్‌లైన్స్ రెడీ చేసి.. పర్యాటకుల్నిఅనుమతిస్తామని సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు.

ఈ మేరకు గోవాలో టూరిస్టులు ఎలా ఉండాలో ఓ ప్లాన్ రెడీ చేసుకుంటోంది గోవా పర్యాటక శాఖ. పర్యాటకులందరకూ శానిటైజర్లు, మాస్కులు, గ్లోవ్స్, భౌతిక దూరం పాటిస్తూ ఉండేలా చర్యలు తీసుకోబోతున్నారట. అలాగే ఎక్కడ బడితే అక్కడ లిక్కర్, ఆహారం ఇష్టమొచ్చినట్లు అమ్మరని.. గోవా పర్యాటక శాఖ ఓ నివేదిక తయారు చేస్తోంది.

Read More:

బ్రేకింగ్ న్యూస్: ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ కీలక ప్రసంగం

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. టెన్త్ విద్యార్థులకు వాట్సాప్‌ లెసన్స్

పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం