‘కోవిడ్-19 అదుపులోకి వస్తే మళ్ళీ విమాన సర్వీసులు’.. కేంద్రం

దేశంలో కరోనా వైరస్ అదుపులో ఉందని ప్రభుత్వం నిర్ధారణకు వఛ్చిన పక్షంలో దేశీయ,  అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలను ఎత్తి వేస్తామని పౌర విమాన యాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరి తెలిపారు. కరోనా బెడద కంట్రోల్ లో ఉందని, భారతీయులకు ఇక ప్రమాదం లేదని ప్రభుత్వం స్థిరాభిప్రాయానికి వచ్సినప్పుడు ఈ ఆంక్షలను రద్దు చేస్తామని ఆయన ట్వీట్ చేశారు. ఈ విపత్కర సమయంలో అంతా ప్రభుత్వానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విమాన సర్వీసులు […]

కోవిడ్-19 అదుపులోకి వస్తే మళ్ళీ విమాన సర్వీసులు.. కేంద్రం

Edited By:

Updated on: Apr 08, 2020 | 8:24 PM

దేశంలో కరోనా వైరస్ అదుపులో ఉందని ప్రభుత్వం నిర్ధారణకు వఛ్చిన పక్షంలో దేశీయ,  అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలను ఎత్తి వేస్తామని పౌర విమాన యాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరి తెలిపారు. కరోనా బెడద కంట్రోల్ లో ఉందని, భారతీయులకు ఇక ప్రమాదం లేదని ప్రభుత్వం స్థిరాభిప్రాయానికి వచ్సినప్పుడు ఈ ఆంక్షలను రద్దు చేస్తామని ఆయన ట్వీట్ చేశారు. ఈ విపత్కర సమయంలో అంతా ప్రభుత్వానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విమాన సర్వీసులు నిలిచిపోవడం వల్ల వేలాది మంది చాలా ఇబ్బందులు పడుతున్నారని హర్ దీప్ సింగ్ పూరి విచారం వ్యక్తం చేశారు. మనం త్వరలో ఈ గండం నుంచి బయటపడతామన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.