వెల్లివిరిసిన మానవత్వం..హిందూ శ్మశానవాటికలో ముస్లిం ఖననం..

|

May 30, 2020 | 5:53 PM

హిందూ ముస్లింల మధ్య మత సామరస్యం మరోసారి బయటపడింది. కరోనా మ‌ృతిచెందిన ముస్లీం వ్యక్తికి హిందూ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.

వెల్లివిరిసిన మానవత్వం..హిందూ శ్మశానవాటికలో ముస్లిం ఖననం..
Follow us on

భారతదేశంలో అన్నిమతాలవారు, అన్ని వర్గాల వారు నివసిస్తుంటారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరిపని వారు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే హిందూ ముస్లింల మధ్య మత సామరస్యం మరోసారి బయటపడింది. కరోనా మ‌ృతిచెందిన ముస్లీం వ్యక్తికి హిందూ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.

ఖాజా మియా (55) అనే వ్యక్తి ఇటీవల గుండె పోటుతో చనిపోయాడు. లాక్‌డౌన్ కారణంగా అతన్ని హైదరాబాద్‌లోనే ఖననం చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ముత్వాలీలు దీనికి అనుమతి ఇవ్వలేదు. ఆరు శ్మశాన వాటికల చుట్టూ తిరిగినా ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో సందీప్, శేఖర్ అనే ఇద్దరు యువకుల చొరవతో హిందూ శ్మశాన వాటికలో ఖాజా మియా భౌతిక కాయాన్ని పూడ్చి పెట్టారు. శాస్రబద్ధంగా కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ విషయం మత పెద్దలకు తెలియడంతో ఖననానికి నిరాకరించిన వారిపై మండిపడ్డారు. చనిపోయిన వారి పట్ల ఇంత అమానవీయంగా వ్యవహరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. కాగా ఇప్పటికే కరోనా రోగుల మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు బాలాపూర్ సమీపంలో ప్రత్యేకంగా ఓ శ్మశాన వాటికను కూడా ఏర్పాటు చేశారు.