Former Chief Minister: ప్రపంచమంతా కుగ్రామంలా మారుతున్న వేళ.. కరోనా మహమ్మారి ఒక్కసారిగా అంతా చిన్నాభిన్నాం చేసిందనేది సత్యం. కరోనా వైరస్ కారణంగా మనుషుల మధ్య ఎన్నడూ లేనంత దూరాలు పెరిగాయి. అటువైపు ఎవరైనా తుమ్మినా, దగ్గినా.. ఇటువైపు వారు పారిపోయే పరిస్థితి తెచ్చింది కరోనా. చివరికి పలకరింపులో భాగంగా కరచాలనం చేయాలన్నా జనాలు హడలిపోతున్నారు. అయితే ఈ పరిస్థితిపై జమ్మూకశ్మీర్ నేత, నేన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కామెంట్స్‌తో అందరినీ ఒక్కసారిగా కడుపుబ్బా నవ్చించారు. అసలేం జరిగిందంటే.. జమ్మూ కశ్మీర్‌లో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ఫరూఖ్ అబ్దుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కరోనా దెబ్బతీసిన విధానంపై తన శైలిలో హాస్య చతురతను ప్రదర్శిస్తూ సభలో నవ్వులు పూయించారు.
‘కరోనా కారణంగా బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. మిత్రులకు కరచాలనం చేయాలన్నా జనాలు జడుసుకుంటున్నారు. ఇక నా పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. నేను ఇంట్లో నుంచి బయటకు రావాలంటే కుటుంబ సభ్యులు పెట్టే ఆంక్షలన్నీ దాటుకుని రావాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భాల్లో బయటకు వచ్చినప్పుడు మిత్రులను కౌగిలించుకుందామని హృదయం కోరుతున్నా.. పరిస్థితుల కారణంగా అలా చేయలేకపోతున్నా. ఒకవేళ్ల నేను మాస్క్ పెట్టుకోకుండా ఏదైనా ఫోటోలో కనిపించానే అనుకో.. ఇంటికెళ్లాక నా పని అయిపోయినట్లే. నా కూతురు నన్న వాయించేస్తుంది. ఈ మాయదారి కరోనా కారణంగా చివరికి నా భార్యను కూడా కనీసం ముద్దు పెట్టుకోలేకపోతున్నా. ప్రస్తుతం టీకా వచ్చింది. మరి దాని సామర్థ్యం ఏంటనేది కాలమే వెల్లడిస్తుంది.’ అంటూ ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. అయితే, ఫరూఖ్ కామెంట్స్‌తో సభ మొత్తం నవ్వులు పూసింది. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన అందరూ కడపుబ్బా నవ్వారు. ఇదిలా ఉంటే.. దాదాపు 35 నిమిషాలపాటు సాగిన ఆయన ప్రసంగానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also read: