PPF: కేవలం 1 శాతం వడ్డీకే లోన్..

|

May 07, 2020 | 10:11 AM

క‌రోనా, లాక్‌డౌన్ క‌ష్టాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ‌, ప్రైవేటు బ్యాంకులు అనేక ఆఫ‌ర్లు, వెసులుబాట్లు క‌ల్పిస్తున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ కూడా గుడ్ న్యూస్ చెప్పింది.

PPF: కేవలం 1 శాతం వడ్డీకే లోన్..
Follow us on
క‌రోనా, లాక్‌డౌన్ క‌ష్టాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ‌, ప్రైవేటు బ్యాంకులు అనేక ఆఫ‌ర్లు, వెసులుబాట్లు క‌ల్పిస్తున్నాయి. ఖాతాదారుల‌కు ఊర‌టనిచ్చే విధంగా .. ఇప్ప‌టికే మూడు నెల‌ల మార‌టోరియం ప్ర‌క‌టించిన ఆర్బీఐ తాజాగా మ‌రో మూడు నెల‌లు పొడిగించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే (పీపీఎఫ్) పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ కూడా గుడ్ న్యూస్ చెప్పింది. పీపీఎఫ్ పై కూడా త‌క్కువ శాతం వ‌డ్డీతో లోన్ తీసుకునే వెసులుబాటును క‌ల్పించింది. అయితే, ఇక్క‌డ కొన్నిష‌ర‌తులు కూడా వ‌ర్తిస్తాయ‌ని స్ప‌ష్టం చేసింది.
పీపీఎఫ్ బ్యాలెన్స్‌పై లోన్ తీసుకోవచ్చని, పీపీఎఫ్ అకౌంట్ ప్రారంభించిన మూడో ఏడాది నుంచి ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుందని ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు తెలిపారు. మూడేళ్ల నుంచి 6 ఏళ్ల మధ్యలో మాత్రమే లోన్ తీసుకోవడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ఒకవేళ అకౌంట్ తెరిచి 6 ఏళ్లు దాటితే అప్పుడు పీపీఎఫ్ అకౌంట్ నుంచి ముందుగానే డబ్బులు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
పీపీఎఫ్ అకౌంట్‌పై రుణం తీసుకుంటే.. మీరు వడ్డీ కోల్పోతారు. అంతేకాకుండా మీరు 1 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు పీపీఎఫ్ ఖాతాపై వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. ఇది మనకు రాదు. లోన్ తీసుకుంటే 1 శాతం వడ్డీ కట్టాలి. అంటే.. మీరు లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 8.1 శాతం అవుతుంది. అంతేకాకుండా పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కూడా కోల్పోతారు. పీపీఎఫ్ అకౌంట్‌పై వచ్చే వడ్డీ మొత్తానికి ఎలాంటి పన్ను పడదు. మీరు లోన్ తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి వడ్డీ రాదు. దీంతో పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా మీరు కోల్పోయినట్లు అవుతుంది. అలాగే కాంపౌండిగ్ బెనిఫిట్‌ కూడా మిస్ అవుతుంద‌ని చెబుతున్నారు. కాబ‌ట్టి అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప పీపీఎఫ్ లోన్ తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.