Corona Vaccine: కరోనా మహమ్మారిని అంతమొందించే లక్ష్యంతో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఓవైపు విజృంభిస్తోన్న కరోనా సెకండ్ వేవ్‌ను తట్టుకోవాలంటే మన దగ్గర ఉన్న ఏకైక లక్ష్యం వ్యాక్సినేషన్ ఒక్కటేనని నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయితే ఇప్పటికీ చాలా మందిలో అనుమానులున్నాయి. లేనిపోని అపోహలతో చాలా మంది వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటున్నారు. సెలబ్రిటీలు సైతం వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పిస్తోన్న దూరంగా ఉంటున్నారు.
అంతే కాకుండా వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా కొందరిలో మళ్లీ పాజిటివ్ వస్తోందనీ ఇటీవల వార్తలు షికార్లు చేసిన విషయం తెలిసిందే. దీంతో వ్యాక్సిన్‌పై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మళ్లీ కరోనా సోకితే ఇక వ్యాక్సిన్ తీసుకోవడంలో ఉపయోగమేంటనే వాదన వినిపిస్తోంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒకవేళ మళ్లీ కరోనా పాజిటివ్‌గా తేలినా సరే పెద్దగా ప్రమాదం ఏముండదని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయమై తాజాగా ఢిల్లీకి చెందిన ప్రముఖ డాక్టర్.. అర్వింద్ సింగ్ ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అర్వింద్ నెల రోజుల క్రితం కరోనా సెకండ్ డోస్ తీసుకున్నారు. అయితే తాజాగా అతనికి మళ్లీ కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. “నాకు మళ్లీ పాజిటివ్ వచ్చినా.. లక్షణాలు పెద్దగా ఏమి కనిపించడం లేదు. వ్యాక్సిన్ పనిచేస్తోంది. నేను ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. ఆన్‌లైన్‌లో రోగులకు చికిత్స అందిస్తూ.. అందరికీ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పిస్తున్నాను అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ లెక్క చూస్తే వ్యాక్సిన్ వైరస్‌ను శరీరంలో నుంచి పూర్తిగా తరిమికొట్టక పోయినా.. దాన్ని తట్టుకునే శక్తిని ఇస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Got COVID 9 months ago, received the 2nd vaccine dose a month ago. Now am COVID positive again!
Not unexpectedly, my symptoms are quite mild (vaccines work). Will continue to see patients online. And spread awareness.
Stay safe. Stay home.
— Dr. Arvinder Singh Soin (@ArvinderSoin) April 18, 2021
Also Read: భరించలేని తలనొప్పితో బాధపడతున్నారా ? అయితే నిపుణులు సూచిస్తున్న ఈ టీలను ట్రై చేయాల్సిందే..
‘మహారాష్ట్ర థర్డ్ కోవిడ్ వేవ్ కి సమాయత్తమవుతోంది’, మంత్రి ఆదిత్య థాక్రే సంచలన వ్యాఖ్యలు