మ‌ర‌ణాలు అన్నీ క‌రోనా చావులు కాదు..గోప్య‌త లేద‌న్న‌ మంత్రి ఈట‌ల‌

|

Jul 28, 2020 | 7:48 PM

తెలంగాణ‌లో క‌రోనా మ‌ర‌ణాలు దాచిపెడుతున్నారంటూ వ‌స్తున్న వార్త‌లను ఖండించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌. రాష్ట్రంలో 81 శాతం మంది బాధితుల్లో...

మ‌ర‌ణాలు అన్నీ క‌రోనా చావులు కాదు..గోప్య‌త లేద‌న్న‌ మంత్రి ఈట‌ల‌
Follow us on

తెలంగాణ‌లో క‌రోనా మ‌ర‌ణాలు దాచిపెడుతున్నారంటూ వ‌స్తున్న వార్త‌లను ఖండించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌. వరంగల్‌లో కరోనా కేసులు గత రెండు మూడు రోజుల నుంచి తీవ్రంగా నమోదవుతున్న నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో కలిసి ఈటల రాజేందర్ సి.ఎస్.ఆర్ గార్డెన్స్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

కరోనా వైరస్ మహమ్మారి మానవాళి మొత్తానికి పెను సవాలుగా మారింద‌ని అన్నారు మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌. క‌రోనా వైరస్‌ను సకాలంలో గుర్తించని వారికి ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 81 శాతం మంది బాధితుల్లో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం లేద‌ని తెలిపారు. ర్యాపిడ్ యాంటీ కిట్‌తో 30 నిమిషాల్లోనే క‌రోనా టెస్టు ఫలితం వ‌స్తుందన్నారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌లో అన్ని స‌దుపాయాలు ఉన్నాయ‌ని చెప్పిన మంత్రి ఈట‌ల‌…ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు వెళ్లి వృధా ఖ‌ర్చు చేయ‌వ‌ద్ద‌న్నారు. తెలంగాణ‌లో ఎలా చ‌నిపోయినా క‌రోనాతో మృతిచెందిన‌ట్లు భావిస్తున్నార‌న్న ఈట‌ల‌..మ‌ర‌ణాలు అన్నీ క‌రోనా చావులు కాద‌న్నారు. కరోనా మర‌ణాల్లో గోప్య‌త లేద‌ని స్ప‌ష్టం చేశారు.

కరోనా వైరస్‌ను ధైర్యంగా ఎదుర్కొందామని మంత్రి ఈటల పిలుపునిచ్చారు. గ‌తంలో అనేక రకాల ప్రమాదకర వ్యాధులను ఎదుర్కొని వాటి నుంచి సురక్షితంగా బయటపడ్డ సత్తా మన సొంతమని గుర్తు చేశారు. అయితే, వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారు మాత్రం తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సిందేనని మంత్రి సూచించారు.