AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాపై ఆరోగ్య మంత్రి సమీక్ష.. ఆ లిస్ట్‌లో తెలుగు రాష్ట్రాలు

దేశంలో కరోనా విస్తరణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షల మార్కును క్రాస్ చేయగా.. మరణాల సంఖ్య 16వేలను దాటేసింది.

కరోనాపై ఆరోగ్య మంత్రి సమీక్ష.. ఆ లిస్ట్‌లో తెలుగు రాష్ట్రాలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 27, 2020 | 10:08 PM

Share

దేశంలో కరోనా విస్తరణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షల మార్కును క్రాస్ చేయగా.. మరణాల సంఖ్య 16వేలను దాటేసింది. కాగా దేశం మొత్తంలో ఉన్న యాక్టివ్ కేసుల్లో 85.5%.. మరణాల్లో 87% ఎనిమిది రాష్ట్రాల్లోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఆ జాబితాలో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ ఉన్నాయని ఆయన అన్నారు. కరోనా తీవ్రతపై హర్షవర్ధన్ నేతృత్వంలోని కేంద్రమంత్రుల ప్రత్యేక బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా కరోనా కట్టడి చర్యలపై సమీక్షించారు.

మరోవైపు రాష్ట్రాలకు సాంకేతికంగా సాయం అందించేందుకు 15 బృందాలను ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాలకు కేంద్రం అందుబాటులో ఉంచనుంది. ఇక ఇందులో ఓ కేంద్ర బృందం గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా దేశంలో ఇప్పటివరకు 2,95,881 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. రికవరీ రేటు 58%పైగా నమోదైంది. ఇక మరణాల రేటు 3శాతంగా ఉండగా.. ప్రస్తుతం దేశంలో దాదాపు 1.98 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Follow Us
ఏం తెలివిరా సామీ? స్మార్ట్‌ కోతి..గివ్ అండ్ టేక్ బిజినెస్ చూశారో
ఏం తెలివిరా సామీ? స్మార్ట్‌ కోతి..గివ్ అండ్ టేక్ బిజినెస్ చూశారో
రాష్ట్రంలోనే తొలి రోప్ వేకు రంగం సిద్ధం..!
రాష్ట్రంలోనే తొలి రోప్ వేకు రంగం సిద్ధం..!
నలుపు రంగు నిజంగా అశుభమేనా? పూజల్లో ఎందుకు దూరంగా ఉంచుతారో తెలుసా
నలుపు రంగు నిజంగా అశుభమేనా? పూజల్లో ఎందుకు దూరంగా ఉంచుతారో తెలుసా
రైతు పర్మిషన్ లేకుండా పొలంలో కరెంట్, సెల్ టవర్లు వేస్తే ఏంచేయాలి?
రైతు పర్మిషన్ లేకుండా పొలంలో కరెంట్, సెల్ టవర్లు వేస్తే ఏంచేయాలి?
మామిడి పండ్లు తిని తొక్కలను పారేస్తున్నారా? వాటితో ఎన్నో లాభాలు
మామిడి పండ్లు తిని తొక్కలను పారేస్తున్నారా? వాటితో ఎన్నో లాభాలు
20 నిమిషాల పనికి రూ.9,500 ఫీజు, అక్కడ మెకానిక్ సంపాదన తెలిస్తే
20 నిమిషాల పనికి రూ.9,500 ఫీజు, అక్కడ మెకానిక్ సంపాదన తెలిస్తే
పార్టీ ఒత్తిడికి తలొగ్గిన స్టార్మర్.. ప్రధాని పదవికి గుడ్‌బై!
పార్టీ ఒత్తిడికి తలొగ్గిన స్టార్మర్.. ప్రధాని పదవికి గుడ్‌బై!
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
రాజ్‌నాథ్‌తో రేవంత్ భేటీ.. తెలంగాణకు కీలక ప్రాజెక్టులపై చర్చ!
రాజ్‌నాథ్‌తో రేవంత్ భేటీ.. తెలంగాణకు కీలక ప్రాజెక్టులపై చర్చ!
NEET 2026 రీ-ఎగ్జామ్‌లో భారీ స్కామ్‌.. పరీక్ష రాసిన డమ్మీగాళ్లు
NEET 2026 రీ-ఎగ్జామ్‌లో భారీ స్కామ్‌.. పరీక్ష రాసిన డమ్మీగాళ్లు