గుడ్‌న్యూస్‌.. కరోనా మెడిసిన ఫావిపిరవిర్.. హోం డెలివరీ ఫ్రీ

| Edited By:

Aug 19, 2020 | 8:09 PM

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌ లేకపోవడంతో రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. అంతేకాదు.. దీనికి సరైన..

గుడ్‌న్యూస్‌.. కరోనా మెడిసిన ఫావిపిరవిర్.. హోం డెలివరీ ఫ్రీ
Follow us on

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌ లేకపోవడంతో రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. అంతేకాదు.. దీనికి సరైన మందులు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పేషెంట్స్‌. అయితే ఇటీవల కరోనా మహమ్మారి ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఫావిపిరవిర్
మెడిసిన్ ఉపయోగించడం ద్వారా కరోనా పేషెట్స్‌ త్వరితగతిన కోలుకుంటున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ మెడిసిన్‌ను మన దేశంలోని పలు సంస్థలు తయారు చేస్తున్నాయి. తాజాగా ప్రసిద్ధ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కూడా ఈ ఔషధాన్ని భారత్‌లో విడుదల చేసింది. కరోనా చికిత్సలో ఎంతో ఉపయోగపడుతున్న ఫావిపిరవిర్ అనే మందును.. పలు కంపెనీలు వేర్వేరు పేర్లతో మన దేశంలో విడుదల చేస్తున్నాయి. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ దీనిని అవిగాన్ పేరుతో జెనరిక్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. అవిగాన్‌ 200 మి.గ్రా టాబ్లెట్‌ విడుదల చేసింది. దీనికి డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) నుంచి అనుమతి లభించింది. 122 టాబ్లెట్ల ప్యాక్‌లో కంపెనీ ఈ ఔషధాన్ని విడుదల చేసింది. దేశంలోని 41 సిటీల్లో ఈ డ్రగ్‌ను ఫ్రీ హోం డెలివరీ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఇందుకోసం.. కంపెనీ హెల్ప్‌ లైన్ నంబర్ 1800-267-0810 ను ఏర్పాటు చేసింది. అంతేకాదు.. www.readytofightcovid.in వెబ్‌సైట్‌ ద్వారా సంప్రదించవచ్చు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9.00 గంటలకు నంఉచి రాత్రి 9.00 గంటల వరకు హెల్ప్‌ లైన్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

Read More :

దేశరాజధానిలో భారీ వర్షం.. గోడ కూలి కార్లు ధ్వంసం

విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం