Arvind Kejriwal: దేశ రాజధానిలో విజృంభిస్తున్న కోవిడ్.. లాక్‌డౌన్‌పై సీఎం కేజ్రీవాల్ ఏమన్నారంటే?

దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ దడపుట్టిస్తోంది. గత ఐదు రోజులుగా ప్రతి రోజూ లక్షకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

Arvind Kejriwal: దేశ రాజధానిలో విజృంభిస్తున్న కోవిడ్.. లాక్‌డౌన్‌పై సీఎం కేజ్రీవాల్ ఏమన్నారంటే?
Delhi Corona

Updated on: Jan 11, 2022 | 7:05 PM

Delhi Covid Cases: దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్(Omicron Varient) దడపుట్టిస్తోంది. ఒమిక్రాన్ ప్రభావంతో గత ఐదు రోజులుగా ప్రతి రోజూ లక్షకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో ప్రత్యేక కోవిడ్ ఆంక్షలు విధించారు. నైట్ కర్ఫ్యూలు, ఆదివారపు లాక్‌డౌన్లు, రోజువారీ పాక్షిక లాక్‌డౌన్లు అమలుచేస్తున్నాయి. అలాగే సినిమా థియేటర్లు, హోటళ్లలో 50 శాతం ఆక్యుపెన్సీ వంటి ఆంక్షలు విధించాయి.  అటు దేశ రాజధాని ఢిల్లీ(Delhi) లోనూ కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగాయి. గత 24 గం.ల్లో రాష్ట్రంలో 21 వేలకు(21,259) పైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 23 మరణాలు నమోదయ్యాయి. Covid-19 పాజిటివ్ కేసుల సంఖ్య సోమవారంనాడు అక్కడ 19,166గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 25.65 శాతం ఉంది. రికవరీల సంఖ్య 12,161గా ఉంది. ల్లీలో కోవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య 9000 నుంచి 74,881కి పెరిగాయి. దీంతో ఢిల్లీలో కూడా లాక్‌డౌన్(Lockdown) విధించే అవకాశముందన్న ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో లాక్‌డౌన్ విధించే అంశంపై ఆ రాష్ట్ర సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలకోవిడ్ కేసులు 22వేలకు చేరిందని, గత కొన్ని రోజులుగా పాజిటివిటీ రేటు 24-25 శాతంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఆందోళన చెందకండి.. రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టబోమని వ్యాఖ్యానించారు.

కేరళలో ఇలా..

ఇదిలా ఉండగా కేరళలోనూ కొత్తగా 9,066 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 19 మంది మరణించారు. 2064 రికవరీలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 44,441 యాక్టివ్ కేసులు ఉండగా.. మరణాల సంఖ్య 50,053కు చేరింది.

Also Read..

Bangarraju Trailer: ‘వాసి వాడి తస్సాదియ్యా’.. ఆకట్టుకుంటున్న ‘బంగార్రాజు’ ట్రైలర్..

Viral Photo: కళ్లజోడు పెట్టుకుని స్టైల్‌గా పోజిచ్చిన ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా! అబ్బాయిల డ్రీమ్ గర్ల్..