
దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించాలంటూ ఇక కొన్ని కండిషన్స్‌కు ఓకే చెప్పడమే కాదు.. పాటించాలి కూడా. ఢిల్లీలోకి ప్రవేశించాలంటే.. ఇక మీ ఫోన్‌లలో “ఆరోగ్య సేతు” యాప్‌ను ఖచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే వారంతా.. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆరోగ్య సేతు యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందేనని నిబంధన విధించారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఇప్పటికే సిఫార్స్ చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ “ఆరోగ్య సేతు” యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న వారికి మాత్రమే దేశ రాజధానిలోకి ఎంట్రీకి అనుమతివ్వాలని.. “నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్” డైరెక్టర్ కూడా ప్రభుత్వానికి సూచించారు
అయితే దీనిపై ఇంకా అధికారికంగా మాత్రం ఎలాంటి నిర్ణయం రాలేదని తెలుస్తోంది. ప్రభుత్వం మాత్రం.. యాప్ డౌన్‌లోడ్ నిబంధన తీసుకొచ్చేందుకు సుముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో క్రమక్రమంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఎవరైనా వచ్చే వారుంటే.. యాప్ ద్వారా తగు జాగ్రత్తలు తీసుకుని.. కరోనా రాకుండా ముందస్తు జాగ్రత్తల తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.