పిల్లల్లో కోవిడ్-19 తో బాటు మరో ప్రాణాంతక వ్యాధి…డాక్టర్ల ఆందోళన
కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలున్న పిల్లల్లో మరో ప్రాణాంతక వ్యాధి కూడా బయట పడడం డాక్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా ముంబైలో కోవిడ్-19 కి గురైన సుమారు 100 మంది పిల్లల్లో 18 మందికి పేడియాట్రిక్ మల్టీ సిస్టం ఇన్ ఫ్లమేటరీ..

కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలున్న పిల్లల్లో మరో ప్రాణాంతక వ్యాధి కూడా బయట పడడం డాక్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా ముంబైలో కోవిడ్-19 కి గురైన సుమారు 100 మంది పిల్లల్లో 18 మందికి పేడియాట్రిక్ మల్టీ సిస్టం ఇన్ ఫ్లమేటరీ సిండ్రోమ్ (పీఎంఐఎస్) అనే వ్యాధి సోకినట్టు తెలుసుకుని వైద్యులు షాక్ తిన్నారు. జపాన్ కు చెందిన తొమిస్కు కవాసాకి అనే పిల్లల వ్యాధి నిపుణుడు మొదట ఈ డిసీజ్ ని కనుగొన్నాడట. అందువల్ల దీన్ని ‘కవాసాకి డిసీజ్’ అని కూడా వ్యవహరిస్తున్నారు. జ్వరం, స్కిన్ రాష్, కళ్ళు ఎర్రబడడం, డయేరియా లక్షణాలతో కూడిన ఈ వ్యాధికి వెంటనే చికిత్స లభించకపోతే అత్యంత ప్రమాదకరమని ముంభై లోని వాడియా ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఇప్పటికే నగరంలో ఈ వ్యాధికి గురై ఇద్దరు పిల్లలు మరణించినట్టు వారు చెప్పారు. 10 నెలల వయస్సు నుంచి 15 ఏళ్ళ లోపు పిల్లలకు ఇది సోకుతోందట..
జూన్ నుంచి ఈ వ్యాధి తాలూకు కేసులు బయట పడుతున్నాయని, చెన్నై, ఢిల్లీ, జైపూర్ నగరాల్లో కూడా కొందరు పిల్లలకు ఈ వ్యాధి సోకినట్టు తెలిసిందని ఈ హాస్పిటల్ వైద్యులు తెలిపారు.



