‘ఆర్ఆర్ఆర్‌’లో పాటలను తగ్గించేయనున్న రాజమౌళి?

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్‌ చిత్రం ఆర్ఆర్ఆర్. ఇక ఇందులో మొదటి సారిగా రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తున్నారు. రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా..

ఆర్ఆర్ఆర్‌లో పాటలను తగ్గించేయనున్న రాజమౌళి?

Updated on: Jul 16, 2020 | 3:48 PM

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్‌ చిత్రం ఆర్ఆర్ఆర్. ఇక ఇందులో మొదటి సారిగా రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తున్నారు. రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారని దర్శకుడు ఎప్పుడో అధికారికంగా ప్రకటించేశారు. ప్రస్తుతం అందరి దృష్టీ ఈ సినిమా వైపే ఉంది. ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని.. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు రామ్ చరణ్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వారి ఆశలకు నీళ్లు చల్లేలా.. ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కి బ్రేక్ వేసింది కరోనా మహమ్మారి.

కోవిడ్ కారణంగా దాదాపు 70 శాతం పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ పెండింగ్‌లో పడింది. మరో వైపు విడుదల తేదీ దగ్గర పడుతోంది. దీంతో ఆర్ఆర్ఆర్‌లోని కొన్ని పాటలు తగ్గించే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. ఈ సినిమాలో మొత్తంగా పది పాటల వరకు ప్లాన్ చేసింది చిత్ర బృందం. అయితే అందులో అవసరమైన కొన్ని పాటలను ఉంచి.. మిగతా పాటలను లేపేసి షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నట్టు పలు వార్తలు వస్తున్నాయి. కానీ జక్కన్న సినిమా విషయంలో ఎలాంటి రాజీ పడరు. మరి ఈ లెక్కన ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల తేదీ అయినా వాయిదా పడుతుందేమో చూడాలి.

Read More:

కరోనాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. ఈ వైరస్ రాని వ్యక్తి ఉండకపోవచ్చు..

తిరుమలలో అర్చకులకు కరోనా.. టీటీడీ ఛైర్మన్ అత్యవసర భేటీ..

దేశంలోని మూడు రాష్ట్రాల్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు..

Loading...
Unable to load recommendations.
Follow Us