ఢిల్లీవాసులకే మా హాస్పిటల్స్ లో ‘రిజర్వేషన్’.. అరవింద్ కేజ్రీవాల్

| Edited By: Pardhasaradhi Peri

Jun 07, 2020 | 4:00 PM

తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రులు, కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ లో పడకలను  కేవలం ఢిల్లీ వాసులకే 'రిజర్వ్' చేస్తున్నామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. హాస్పిటల్స్ లో బెడ్ ల కొరతపై వివాదం రేగిన  నేపథ్యంలో..

ఢిల్లీవాసులకే మా హాస్పిటల్స్ లో రిజర్వేషన్.. అరవింద్ కేజ్రీవాల్
Follow us on

తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రులు, కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ లో పడకలను  కేవలం ఢిల్లీ వాసులకే ‘రిజర్వ్’ చేస్తున్నామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. హాస్పిటల్స్ లో బెడ్ ల కొరతపై వివాదం రేగిన  నేపథ్యంలో..ఆయన  ఈ సరికొత్త ప్రకటన చేస్తూ.. ‘మా ఆస్పత్రుల్లో పదివేల పడకలను ఇక్కడివారికే కేటాయిస్తున్నామని, అయితే కేంద్రం ఆధ్వర్యంలో నడిచే హాస్పటల్స్ లోని  పడకలను ఏ ప్రాంతం రోగులైనా వాడుకోవచ్ఛునని చెప్పారు. గత వారం రోజులుగా ఈ నగరంలో కరోనా రోగుల సంఖ్య పెరుగుతోంది. రోజుకు సుమారు వెయ్యి  చొప్పున ఈ కేసులు నమోదవుతున్నాయి. జూన్ మాసాంతానికి మా  నగరానికి కనీసం పదిహేనువేల పడకలు అవసరమవుతాయని భావిస్తున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.