Delhi Covid-19: దేశరాజధాని ఢిల్లీ లో తగ్గుముఖం పట్టిన కరోనా.. 9నెలల తర్వాత వందలోపే కేసులు నమోదు

|

Jan 28, 2021 | 10:17 AM

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. తొమ్మిది నెలల తర్వాత తొలిసారిగా వందలోపే కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఏప్రిల్ తర్వాత హస్తినలో 100 కంటే తక్కువ కోవిడ్ -19 కేసులను......

Delhi Covid-19: దేశరాజధాని ఢిల్లీ లో తగ్గుముఖం పట్టిన కరోనా.. 9నెలల తర్వాత వందలోపే కేసులు నమోదు
Follow us on

Delhi Covid-19 : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. తొమ్మిది నెలల తర్వాత తొలిసారిగా వందలోపే కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఏప్రిల్ తర్వాత హస్తినలో 100 కంటే తక్కువ కోవిడ్ -19 కేసులను నమోదుకావడం ఇదే మొదటిసారని ప్రభుత్వం ప్రకటించింది. గత 24 గంటల్లో 96 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6,34,325 లకు చేరుకున్నాయి. ఇక గత 24 గంటల్లో తొమ్మిదిమంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 10,829లకు చేరుకుంది. అదేవిధంగా 212 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ ఈ వైరస్ తో పోరాడి కోలుకున్నవారి సంఖ్య 6.2 లక్షలకు చేరుకుంది. ఢిల్లీలో మొత్తం రికవరీ రేటును 98%గా ఉందని రాష్ట్ర వైద్య అధికారులు తెలిపారు.

 

Also Read: కుక్కను బతికించా.. చెల్లి ఆత్మనీ రప్పిస్తా.. హరర్‌ మూవీని తలపిస్తున్న మదనపల్లె కేసు..