దేశ రాజధానిలో తగ్గని కరోనా కేసులు

| Edited By:

Aug 13, 2020 | 6:50 PM

దేశ రాజధానిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కేసుల సైంఖ్య వెయ్యికి పైగా నమోదవ్వగా.. గడిచిన 24 గంటల్లో వెయ్యికి లోపల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా..

దేశ రాజధానిలో తగ్గని కరోనా కేసులు
Follow us on

దేశ రాజధానిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కేసుల సైంఖ్య వెయ్యికి పైగా నమోదవ్వగా.. గడిచిన 24 గంటల్లో వెయ్యికి లోపల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా టెస్టుల సంఖ్య పెంచి.. ట్రాకింగ్, ట్రేసింగ్, టెస్టింగ్ చేపడుతున్నప్పటికీ.. కేసుల సంఖ్య అంతంతమాత్రంగానే తగ్గుతున్నాయి. నిత్యం వెయ్యి వరకు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటలల్లో ఢిల్లీ వ్యాప్తంగా కొత్తగా మరో 956 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,49,460కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 1,34,318 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా 10,975 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కాగా, గురువారం నాడు ఢిల్లీ వ్యాప్తంగా దాదాపు 15 వేల కరోనా పరీక్షలు నిర్వహించారు. వీటిలో 6,478 ఆర్టీపీసీఆర్ విధానం ద్వారా టెస్టులు చేయగా..8,878 రాపిడ్ యాంటిజెన్‌ విధానం ద్వారా టెస్టులు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా 12,58,095 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.

 

6478 RTPCR/CBNAAT/TrueNat tests and 8878
Rapid antigen tests conducted today. So far, 1258095 tests have been done: Delhi Govt https://t.co/7sDKBQeU4j

— ANI (@ANI) August 13, 2020

Read More :

రాజస్థాన్‌లో తాజాగా మరో 608 పాజిటివ్‌ కేసులు

“మహా” పోలీసులను వణికిపోస్తున్న కరోనా మహమ్మారి