దేశ రాజధానిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టాయనుకున్న వేళ.. మళ్లీ వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,398 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,56,139కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 1,40,767 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా 11,137 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఇక ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా కరోనా బారినపడి 4,235 మంది మరణించారు. కాగా, గడిచిన కొద్ది రోజులుగా ఢిల్లీలో నిత్యం 15 నుంచి 20 వేల కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.
Delhi reports 1,398 new #COVID19 cases, 1,320 recoveries and 9 deaths over the last 24 hours.
Total number of cases now at 1,56,139 including 1,40,767
dischraged/recovered/migrated patients, 11,137 active cases and 4,235 deaths. pic.twitter.com/bMfVnTKXZL— ANI (@ANI) August 19, 2020
Read More :