ఢిల్లీలో అదుపులోకి వస్తున్న కరోనా

| Edited By:

Jul 31, 2020 | 5:57 PM

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తుంది. గత కొద్ది రోజులుగా వెయ్యి నుంచి పన్నెండు వందలకు మధ్య కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు రికవరీలు కూడా పెద్ద ఎత్తున..

ఢిల్లీలో అదుపులోకి వస్తున్న కరోనా
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తుంది. గత కొద్ది రోజులుగా వెయ్యి నుంచి పన్నెండు వందలకు మధ్య కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు రికవరీలు కూడా పెద్ద ఎత్తున ఉంటున్నాయి. మరోవైపు కేసుల సంఖ్య పెరిగితే అప్రమత్తంగా ఉండేందుకు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా రోజు వారీగా  టెస్టుల సంఖ్యను కూడా పెంచేశారు. గడిచిన 24 గంటల్లో ఢిల్లీ వ్యాప్తంగా కొత్తగా మరో 1195 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,35,598కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 1,20,930 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా 10,705 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఢిల్లీ వ్యాప్తంగా కరోనా బారినపడి 27 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా కరోనా బారినపడి 3,963 మంది మరణించారు. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.

Read More 

కాలుజారి నదిలో పడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

తైవాన్‌ మాజీ అధ్యక్షుడు ఇక లేరు

కల్తీ మద్యం కాటుకు నలుగురు మృతి

ఆఫ్ఘన్‌లో కారు బాంబు పేలుడు.. 8 మంది మృతి