దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఓ వైపు అదుపులోకి వచ్చేందుకు కరోనా పరీక్షల సంఖ్య పెంచడంతో పాటుగా.. ట్రాకింగ్, ట్రేసింగ్, టెస్టింగ్ పద్దతి పాటిస్తున్నప్పటికీ.. గత కొద్ది రోజులుగా నిత్యం వెయ్యికి పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసులతో లక్షన్నర మార్క్ దాటింది. కొత్తగా మరో 1,192 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,50,652కి చేరింది. ఇక వీటిలో కరోనా నుంచి కోలుకుని 1,35,108 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా ప్రస్తుతం 11,366 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.
Delhi reports 1,192 new #COVID19 cases and 11 deaths today. Total number of cases now at 1,50,652 including 11,366 active cases, 1,35,108 recovered/discharged/migrated cases and 4,178 deaths: Delhi government pic.twitter.com/AcTT2LrwaT
— ANI (@ANI) August 14, 2020
Read More :