ఢిల్లీలో కేసుల కంటే పెరిగిన రికవరీలు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. రోజురోజుకు నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులకంటే.. రికవరీల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,118 కరోనా పాజిటివ్‌..

ఢిల్లీలో కేసుల కంటే పెరిగిన రికవరీలు

Edited By:

Updated on: Aug 01, 2020 | 6:28 PM

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. రోజురోజుకు నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులకంటే.. రికవరీల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,118 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,36,716కి చేరింది. వీటిలో కరోనా
నుంచి కోలుకుని 1,22,131 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా 10,596 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 1,201 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రలు నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఇక కరోనా బారినపడి ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా 3,989 మంది మరణించారు.

Read More

ముందు ఉల్లి బస్తాలు.. వెనుక గంజాయి బస్తాలు

రాజౌరీ సెక్టార్‌లో పాక్‌ కాల్పులు.. జవాన్‌ వీరమరణం