Covid Restricts: ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభించడంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. బహిరంగ వేడుకలపై ఆంక్షలు

|

Dec 22, 2021 | 10:08 PM

ఒమిక్రాన్‌ విజృంభణ కారణంగా దేశం లోని పలు రాష్ట్రాలు ఆంక్షలను కఠినం చేస్తున్నాయి. ఢిల్లీలో క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలపై బ్యాన్‌ విధించారు. టీకాలు తీసుకోని ఉద్యోగుల జీతాలు నిలిపివేస్తామని పంజాబ్‌ ప్రభుత్వం ప్రకటించింది.

Covid Restricts: ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభించడంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. బహిరంగ వేడుకలపై ఆంక్షలు
Aravind Kejriwal
Follow us on

Delhi Govt. on Covid 19 Restricts:  ఒమిక్రాన్‌ విజృంభణ కారణంగా దేశం లోని పలు రాష్ట్రాలు ఆంక్షలను కఠినం చేస్తున్నాయి. ఢిల్లీలో క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలపై బ్యాన్‌ విధించారు. టీకాలు తీసుకోని ఉద్యోగుల జీతాలు నిలిపివేస్తామని పంజాబ్‌ ప్రభుత్వం ప్రకటించింది.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభించడంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్‌ , న్యూఇయర్‌ వేడుకలపై డీడీఎంఏ నిషేధం విధించింది. బహిరంగ వేడుకలపై ఆంక్షలు విధించారు. షాపింగ్‌కు వచ్చేవాళ్లు తప్పకుండా మాస్క్‌లు ధరించాలని , లేదంటే దుకాణాల్లోకి అనుమతించరాదని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో క్రమంగా కరోనా పాజిటివిటీ రేటు పెరుగుతోంది. ఆరునెలల్లో గరిష్ట కేసులు బుధవారం నమోదయ్యాయి. 125 మందికి కరోనా సోకింది.

ఒమిక్రాన్‌పై దేశరాజధానిలో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఇప్పటివరకు 57 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కావడంతో చర్యలు తీసుకుంటున్నారు. కర్నాటకలో కూడా ఇప్పటికే క్రిస్మన్‌ , న్యూఇయర్‌ వేడుకలపై నిషేధం విధించారు. ఒమిక్రాన్‌ అలజడి కారణంగా పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకొని ఉద్యోగుల జీతాలు నిలిపివేస్తామని హెచ్చరించింది.

హర్యానాలో కూడా ఆంక్షలు విధించారు. టీకా తీసుకోనివాళ్లను బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా నిషేధం విధించారు. మంగళవారం ఒక్కరోజే ఢిల్లీలో 20కి పైగా ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒమిక్రాన్‌ వ్యాప్తిపై చర్చించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుంది. కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో మోదీ పరిస్థితిని సమీక్షిస్తారు.

గత 20 రోజుల నుంచి దేశంలో ఒమిక్రాన్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అవసరమైతే రాష్ట్రాలు నైట్‌ కర్ఫ్యూ విధించాలని కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు ఇప్పటికే లేఖ రాసింది. వార్‌రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని కూడా కోరారు.

Read Also… ప్రధాని తీసుకున్న చర్యల్లో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ అత్యంత ప్రశంసనీయం.. మోడీ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం జగన్‌..