DCGI on corona vaccine: దేశంలో కొవిడ్ కేసులు తీవ్రత పెరిగిపోవడంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా కొరతను అధిగమించేందుకు విదేశీ టీకాలకు అనుమతుల విషయంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. దీంతో అమెరికా ఎఫ్‌డీఐ, ఐరోపా సంఘంలోని ఈఎంఏ, యూకేలోని ఎంహెచ్‌ఆర్‌ఏ, జపాన్ పీఎండీఏ, ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ జాబితాలో అనుమతులు పొందిన టీకాలను భారత్‌కు రప్పించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందు అనుగుణంగా కొత్త మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఒక ప్రకటనలో వెల్లడించింది.
‘నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మిన్‌స్ట్రేషన్’ సిఫార్సు మేరకు విదేశీీ టీకాల అత్యవసర అనుమతులను వేగవంతం చేయాలని భావిస్తోంది. ఇందుకోసం అవసరమైన మార్గదర్శకాలను డీసీజీఐ నేతృత్వంలోని ‘ది సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్’ తయారు చేసి వెబ్‌సైట్‌లో ఉంచనుంది. ఆయా విదేశీ టీకా సంస్థలు భారత అనుబంధ సంస్థలు లేదా స్థానికంగా గుర్తింపు పొందిన ఏజెంట్ ద్వారా సీడీఎస్‌సీవోకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి పనికి వస్తుందేమో సీడీఎస్‌సీవో పరిశీలించి 3 రోజుల్లో నిర్ణయాన్ని వెల్లడించాలి. దాని ఆధారంగా ఆ తర్వాత డీసీజీఐ అనుమతులు మంజూరు చేస్తుంది. ఈ కొత్త గైడ్‌లైన్స్ ఆధారంగా విదేశీ వ్యాక్సిన్లు దేశంలోకి రావాలా వద్దే అని కేంద్ర టీసీజీఐ నిర్ణయిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకుని విదేశీ వ్యాక్సిన్లు దేశంలో అడుగు పెట్టేందుకు మూడు, నాలుగు రోజుల సమయం పట్టే అవకాశముందని తెలుస్తోంది.
.@MoHFW_INDIA issues regulatory pathways for foreign-produced #COVID19 vaccines
First 100 beneficiaries of such vaccines shall be assessed for 7 days for safety outcomes before it is rolled out for further vaccination program
Details: https://t.co/WThAeJNP0v pic.twitter.com/CFpchJEnET
— PIB India (@PIB_India) April 15, 2021
ఇదిలావుంటే, ఓ వైపు సెకండ్ వేవ్‌లో వైరస్ వేగంగా విస్తరిస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. కానీ, ప్రభుత్వాల నుంచి వ్యాక్సిన్ సరఫరా నిలిచిపోవడంతో ఆయా రాష్ట్రాల యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. వివిధ రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే టీకాలు తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కేసులు భారీగా పెరుగుతుండడంతో ప్రజల్లో భయం నెలకొనడంతో వ్యాక్సినేషన్ కోసం ఆసుపత్రుల వద్ద ప్రజలు భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. దీంతో వ్యాక్సిన్ నిల్వలు సైతం తగ్గిపోతున్నాయి. వారం రోజుల క్రితం టీకాలను సరఫరా చేయాలని అయా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఇప్పటివరకు స్పందన లేదని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కొన్ని రోజులకు మాత్రమే సరి పోయేంత డోసులు మాత్రమే టీకాలు నిల్వ ఉన్నట్లు వై ద్యఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో వ్యాక్సినేషన్‌కు ప్రజలనుంచి డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అదనంగా సరఫరాచేయాలని భావిస్తోంది. దేశ వ్యాప్తంగా నెలకొన్న వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు విదేశీ వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.