సీఆర్‌పీఎఫ్‌లో 620 కరోనా కేసులు…4 మ‌ర‌ణాలు

భార‌త్‌లో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. దేశ రక్షణ శాఖ కార్యదర్శి నుంచి ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ వరకు కరోనా బారిన ప‌డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం రక్షణ మంత్రిత్వ శాఖనే శానిటైజ్‌ చేయాల్సి రాగా ఆర్మీ కేంద్ర కార్యాలయమే ఉద్యోగుల రాకపోకల్ని, ముఖాముఖి సమావేశాలకు ప‌రిమితం చేసింది. మ‌రోవైపు..

సీఆర్‌పీఎఫ్‌లో 620 కరోనా కేసులు...4 మ‌ర‌ణాలు

Updated on: Jun 15, 2020 | 4:47 PM

భార‌త్‌లో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. దేశ రక్షణ శాఖ కార్యదర్శి నుంచి ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ వరకు కరోనా బారిన ప‌డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసర్చ్‌ అధినేత బలరాం భార్గవ, నీతీఆయోగ్‌ సభ్యుడు వినోద్‌ పాల్‌ తమ సహచరులకు కరోనా వచ్చిందని తేలడంతో క్వారంటైన్‌కు పరిమితమయ్యారు. మొత్తం రక్షణ మంత్రిత్వ శాఖనే శానిటైజ్‌ చేయాల్సి రాగా ఆర్మీ కేంద్ర కార్యాలయమే ఉద్యోగుల రాకపోకల్ని, ముఖాముఖి సమావేశాలకు ప‌రిమితం చేసింది. మ‌రోవైపు పోలీసు, ఆర్మీశాఖ‌ల‌ను కూడా వైర‌స్ వణికిస్తోంది.

సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌)లోనూ క‌రోనా మ‌హ‌మ్మారి క‌ల‌క‌లం రేపుతోంది. తాజాగా 29 క‌రోనా కేసులు న‌మోదైన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. దీంతో మొత్తం సీఆర్‌పీఎఫ్‌లో క‌రోనా సోకిన కేసుల సంఖ్య 620కి చేరింద‌ని అధికారులు వెల్ల‌డించారు. ఇందులో 189 యాక్టివ్ కేసులు ఉండ‌గా..427 మంది వైర‌స్ నుంచి కోలుకున్న‌ట్లు వివ‌రాలు వెల్ల‌డించారు. న‌లుగురు వైరస్ బారిన‌ ప‌డి మ‌ర‌ణించారు.