ప్రార్ధనా మందిరాలు మూసేసి.. మద్యం షాపులు తెరవడమేంటి.?

|

May 14, 2020 | 12:55 PM

దేశవ్యాప్తంగా ఉన్న ప్రార్ధనా మందిరాలను మూసేసి మద్యం దుకాణాలు, బార్లకు కేంద్రం ప్రభుత్వం లాక్ డౌన్ వేళ అనుమతించడం సరికాదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవాలయాలు తెరిస్తే భక్తుల రాకతో పాటు ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. ఒక్క తిరుమల గుడికే నెలకు రూ.400 కోట్లు వస్తుందని.. ఇక యాత్రికుల ద్వారా పన్నుల రూపంలో మరో 400 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని ఆయన అన్నారు. యాదాద్రి, శ్రీశైలం, […]

ప్రార్ధనా మందిరాలు మూసేసి.. మద్యం షాపులు తెరవడమేంటి.?
Follow us on

దేశవ్యాప్తంగా ఉన్న ప్రార్ధనా మందిరాలను మూసేసి మద్యం దుకాణాలు, బార్లకు కేంద్రం ప్రభుత్వం లాక్ డౌన్ వేళ అనుమతించడం సరికాదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవాలయాలు తెరిస్తే భక్తుల రాకతో పాటు ఆదాయం కూడా పెరుగుతుందన్నారు.

ఒక్క తిరుమల గుడికే నెలకు రూ.400 కోట్లు వస్తుందని.. ఇక యాత్రికుల ద్వారా పన్నుల రూపంలో మరో 400 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని ఆయన అన్నారు. యాదాద్రి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ దేవాలయాలను తెరిస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కొట్లలో ఆదాయం లభిస్తుందని నారాయణ పేర్కొన్నారు. కాగా, వలస కూలీలను వారివారి స్వస్థలాలకు వెంటనే తరలించాలని నారాయణ డిమాండ్ చేశారు.

Read This: ఏపీలో మరిన్ని లాక్‌డౌన్ సడలింపులు.. మార్గదర్శకాలు జారీ..