TV9 Campaign Vaccinate All: టీకాతోనే కరోనాకు చెక్.. వ్యాక్సిన్ కోసం బారులు తీరుతున్న జనం.. దేశంలో ఇప్పటి వరకు..

| Edited By: Janardhan Veluru

Jun 10, 2021 | 4:58 PM

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 23 కోట్ల 91 లక్షల 81 వేల 339 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అపోహలు నమ్మకండి. అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోండి. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం.

TV9 Campaign Vaccinate All: టీకాతోనే కరోనాకు చెక్.. వ్యాక్సిన్ కోసం బారులు తీరుతున్న జనం.. దేశంలో ఇప్పటి వరకు..
Covid Vaccine
Follow us on

Covid19 Vaccination in India: దేశంలో కరోనా కేసులు తగ్గాయనుకుంటున్న క్రమంలో.. రికార్డు స్థాయిలో నమోదైన మరణాలు కలవరానికి గురిచేశాయి. ఒక్కరోజులో 6,148మరణాలు సంభవించడం ఆందోళన రేపింది. బీహార్‌ డేటాను సవరించిన నేపథ్యంలో అక్కడే 3వేలమందికిపైగా మృతిచెందినట్టుగా గుర్తించారు. మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ.. ఊహించినంత వేగంగా సాగకపోవడం కాస్త ఇబ్బందికరంగా మారింది. అయితే, అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం. మరి ఇప్పటి వరకు దేశంలో ఎంత మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది? వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎంత మంది? దేశంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ఫుల్‌ డీటేల్స్ ఇప్పుడు చూద్దాం.

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 23 కోట్ల 91 లక్షల 81 వేల 339 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అందులో 19 కోట్ల 33 లక్షల 29 వేల 989 మందికి మొదటి డోస్‌ అందగా.. 4 కోట్ల 58 లక్షల 51 వేల 350 మందికి రెండో డోస్‌ పూర్తైంది. ఇవాళ ఇప్పటి వరకు 9 లక్షల 63 వేల 223 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

Covid Vaccine

ఏపీలో ఇప్పటి వరకు కోటి 12 లక్షల 86 వేల 381 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. 86 లక్షల 87 వేల 957 మందికి మొదటి డోస్‌ అందగా.. 25 లక్షల 98 వేల 424 మందికి రెండో డోస్‌ కూడా పూర్తైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 72 లక్షల 82 వేల 13 మందికి వ్యాక్సినేషన్ అందింది. అందులో మొదటి డోస్‌ పూర్తైన వారు 59 లక్షల 56 వేల 704 మంది ఉండగా.. రెండో డోస్‌ పూర్తైన వారు 13 లక్షల 25 వేల 309 మంది ఉన్నారు.

ఇక ఏ కంపెనీ వ్యాక్సిన్లు ఎన్ని అందాయనే వివరాలు గమనిస్తే.. 21 కోట్ల 08 లక్షల 17 వేల 620 మందికి covisheild అందితే.. 2 కోట్ల 83 లక్షల 42 వేల 703 మందికి covaxine వ్యాక్సిన్లు అందాయి.

18 ఏళ్ల పై బడిన వారంతా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. దేశంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య 27 కోట్లకుపైగానే ఉంది. 27 కోట్ల 50 లక్షల 45 వేల 787 మంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 11 కోట్ల 33 లక్షల 84 వేల 6 మంది.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య గ్రూప్ వారు అయితే.. 16 కోట్ల 16 లక్షల 61 వేల 780 మంది 45 ఏళ్ల పై బడిన వారు.

అందరికి వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం.. అందుకే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోండి.. కరోనాను దరిచేరనివ్వకండీ…

Read Also… KTR on IT Industry Annual Report: తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది.. ఐటీలో రెట్టింపు అయిన ఉద్యోగులు.. మంత్రి కేటీఆర్ వార్షిక నివేదిక విడుదల