ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదు.. ఈ రోజు ఎన్నంటే?

| Edited By:

Jul 06, 2020 | 4:11 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇవాళ కొత్తగా 1322 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అలాగే ఇవాళ ఒక్క రోజే ఏడుగురు మృతి చెందారు. కోవిడ్ వల్ల శ్రీకాకుళంలో ఇద్దరు...

ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదు.. ఈ రోజు ఎన్నంటే?
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇవాళ కొత్తగా 1322 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అలాగే ఇవాళ ఒక్క రోజే ఏడుగురు మృతి చెందారు. కోవిడ్ వల్ల శ్రీకాకుళంలో ఇద్దరు, అనంతపూర్‌లో ఒకరు, చిత్తూరులో ఒకరు, గుంటూరులో ఒకరు, కృష్ణలో ఒకరు, వైజాగ్‌లో ఒకరు మరణించారు. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 20,019కి చేరింది. అలాగే ఇప్పటివరకూ 239 మంది మృతి చెందారు. ఇందులో 10,860 యాక్టివ్ కేసులు ఉండగా, ఇక 8,920 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక సోమవారం కొత్తగా నమోదైన కేసుల్లో అనంతపురం 147, చిత్తూరు 120, ఈస్ట్ గోదావరి 171, గుంటూరు 197, కడప 96, కృష్ణ 55, కర్నూలు 136, నెల్లూరు 41, ప్రకాశం 38, శ్రీకాకుళం 36, విశాఖపట్నం 101, విజయనగరం 24, వెస్ట్ గోదావరిలో 106 కేసులు నమోదయ్యాయి. ఇక గత 24 గంటల్లో ఏపీలో 16,712 సాంపిల్స్‌ని పరీక్షించగా 1263 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.

Read More: 

ఎర్రగడ్డ రైతు బజార్లో కరోనా కలకలం.. మూడు రోజులు మూసివేత

గోల్డ్ కొనాలనుకునే వారికి ఆర్బీఐ బంపర్ ఆఫర్..

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?