కరోనాపై రోజుకో కొత్త నిజం..తాజాగా బయటపడ్డ మరో వాస్తవం..

| Edited By: Pardhasaradhi Peri

May 22, 2020 | 11:12 AM

కరోనా మహమ్మారికి చిన్నపెద్దా అనే తేడా లేదు. వైరస్ వ్యాప్తికి జాతి బేధం అసలే లేదు. అందరినీ ఒకే రకంగా పీడిస్తుంది. అయితే, కరోనా నుంచి తప్పించుకుని బయటపడ్డ వారికి..

కరోనాపై రోజుకో కొత్త నిజం..తాజాగా బయటపడ్డ మరో వాస్తవం..
Follow us on

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6,088 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,18,447కు చేరింది. శుక్రవారం ఒక్క రోజే 148 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 3,583కు చేరింది. ఇప్పటివరకు 48,533 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 66,330గా ఉంది. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటువంటి తరుణంలో కరోనా సోకినవారు భవిష్యత్తులో ఎలాంటి సమ్యలు ఎదుర్కొవాల్సి వస్తుందో తేల్చిచెప్పారు అమెరికన్ సైటిస్టులు.

కరోనా మహమ్మారికి చిన్నపెద్దా అనే తేడా లేదు. వైరస్ వ్యాప్తికి జాతి బేధం అసలే లేదు. అందరినీ ఒకే రకంగా పీడిస్తుంది. అయితే, కరోనా నుంచి తప్పించుకుని బయటపడ్డ వారికి దీర్ఘకాలిక సమస్యలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ వైరస్ నుంచి కోలుకున్న వారికి భవిష్యత్తులో శారీరక, మానసిక సమస్యలు కూడా ఎదురయ్యే ప్రమాదముందని అమెరికాకు చెందిన ఓ పరిశోధకుల బృందం వెల్లడించింది. ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా బలహీనంగా ఉన్నవారిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వారు స్పష్టం చేశారు. 2005లో వచ్చిన కత్రినా హరికేన్ నేపథ్యంలో అమెరికన్ శాస్త్రవేత్తలు నిరుపేద, బలహీన వర్గాల మానసిక స్థితిపై అధ్యయనం ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు వారు కొనసాగిస్తున్న పరిశోధన ఆధారంగా ప్రస్తుత కరోనా ఎఫెక్ట్ కూడా సామాన్యులపై ధీర్ఘకాలంపాటు ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.