Vaccination 2nd phase: నేటి నుంచి రెండో విడత‌, 60 ఏళ్లు దాటిన, 45 ఏళ్లు పైనుండి దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారికి కరోనా టీకాలు

|

Mar 01, 2021 | 8:14 AM

Covid 19 vaccination drive 2nd phase : నేటి నుంచి తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశవ్యాప్తంగా రెండో విడత కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలైంది. ప్రధానంగా 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్ల కంటే ఎక్కువ వయసు..

Vaccination 2nd phase: నేటి నుంచి రెండో విడత‌, 60 ఏళ్లు దాటిన, 45 ఏళ్లు పైనుండి దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారికి కరోనా టీకాలు
Follow us on

Covid 19 vaccination drive 2nd phase : నేటి నుంచి తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశవ్యాప్తంగా రెండో విడత కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలైంది. ప్రధానంగా 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండి దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారికి టీకా ఇవ్వనున్నారు. ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా 102 కేంద్రాల్లో కోవిడ్ టీకా అందించనున్నారు. హైదరాబాద్‌లో 12, ఇతర జిల్లా కేంద్రాల్లో 2 చొప్పున కరోనా వ్యాక్సినేషన్ సెంటర్‌లు ఏర్పాటు చేశారు.

కొవిడ్‌ టీకా తీసుకోవాలనుకునే వారు మొబైల్‌ నెంబర్‌ లేదా ఆధార్‌ సంఖ్య ద్వారా cowin.gov.inలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ తరువాత మొబైల్‌కి వచ్చిన లింక్‌ ద్వారా దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్‌ కేంద్రంలో కొవిడ్‌ టీకా తీసుకోవచ్చని తెలంగాణ ఆరోగ్యశాఖ తెలిపింది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఐడీకార్డుతో పాటు వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం తీసుకురావాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్‌ చేసినా తర్వాతే వ్యాక్సిన్‌ ఇస్తారు.

రాబోయే వారం రోజుల్లో వెయ్యికి పైగా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపడతామని అధికారులు తెలిపారు. అందరూ మొదటి రోజే వ్యాక్సిన్‌ తీసుకునేందుకు తొందరపడవద్దని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి ఒక్కరికీ ఉచిత వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందని, వృద్ధుల కోసం వీలైనంత వరకు వీల్‌చైర్‌లు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా టీకా వేస్తారు.

కరోనా దెబ్బతో మేడారానికి తాళం పడింది. మినీ మేడారం జాతరలో విధులు నిర్వహించిన ఇద్దరు దేవాదాయశాఖ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. వారికి కరోనా నిర్దారణ కావడంతో దర్శనాలు నిలిపివేశారు.. మార్చి01 నుండి 21వ తేదీ వరకు మేడారంలో సెల్ఫ్ లాక్ డౌన్ అమలుచేస్తున్నట్లు మేడారం పూజారుల సంఘం, దేవాదాయ శాఖ అధికారులు ప్రకటించారు.

అటు ఏపీలోను వ్యాక్సినేషన్‌ స్టార్ట్‌ అవ్వనుంది..ఇప్పటికే పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. చిత్తూరు జిల్లాలో కరోనా భయం రోజురోజుకు పెరుగుతోంది. కేసుల పెరుగుదలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతుండం… పాఠశాలలు తెరుచుకోవడంతో అటు తల్లిదండ్రుల్లోనూ ఆందోళన కనిపిస్తోంది. అన్ని స్కూల్స్‌లో కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నామని… భయపడాల్సన పని లేదంటున్నారు విద్యాశాఖాధికారులు.

కరోనా మహమ్మారిని కట్టడి చేసే దిశగా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కుధరించడం, ఫిజికల్ డిస్టెన్స్‌ వంటి కొవిడ్‌ నియంత్రణ రూల్స్‌ను పక్కాగా అమలు చేయాలని సూచించింది. ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నిర్లక్ష్యానికి ఏమాత్రం తావివ్వకూడదని హితవు పలికింది.

Read also : Modi receives COVID vaccine : కరోనా టీకా‌ వేయించుకున్న ప్రధాని, ఢిల్లీ ఎయిమ్స్‌లో ఫస్ట్‌ డోస్‌.. కొవిడ్ రహిత భారతావనికి పిలుపు